తెలంగాణ జెండా!!ప్రతాప్ కౌటిళ్యా
చీకటితో యుద్ధం చేసినా చేయకున్నా
పొద్దు పొడుస్తుంది అనుకుంటే
ప్రశంసించాల్సీందీ
ఉదయాన్నే కదా!!?

ఇవాళ నిన్న ఆకులు
రాలిన రాలకున్నా
రేపు చిగురిస్తుంది అనుకుంటే
పొగడాలి సింది చెట్టును కాదు
మట్టి నని మనకు తెలుస్తుంది!!?

అలలు పుట్టి ఈదడం నేర్చుకున్నాక
కాపురం చేయాల్సింది తీరంతో నేనని
తెలుసుకున్నాక
సముద్రం మధ్యలో చిక్కుకునే ప్రసక్తే లేదు
అభినందించాల్సిందీ
అలను కాదు కాలాన్ని!!?

నీటికి రెక్కలిచ్చీ ఆకాశంలో ఎగిరేసిన
అజాత శత్రువు ఎవరో తెలుసుకున్నాక
అజ్ఞాతంగా బతకాల్సిన అవసరం
అంతరిక్ష నీటి పటాలకు లేదు!!?

శరీరంలో ప్రాణంలా కనిపించని
ఆత్మీయ ఆప్తురాలు ఆలయ గాలిగోపురం పై
ఎగురుతున్న గాలిపటం
ప్రశంసంచించాల్సిందీ మనిషిని కాదు
గాలి నని అర్థమవుతుంది!!?

జ్ఞాపకార్థంగా సమాధుల్నీ కడ్తూపోతే
మిగిలేది ఆకాశమే
మనుషుల మదుల్లో మాత్రమే
చరిత్ర రాయండి
రాత్రినీ నిందీంచీ పగలును వెలిగిద్దాం అని
అనుకోవద్దు మనకు ఇద్దరు ముద్దు!!?

విప్లవాలన్నీ ఎర్ర నీవే కావు
పచ్చని ఆకు ప్రపంచ ఆకలి తీర్చింది
తెల్లని పాలు పసిపిల్లల తల్లులకు ప్రాణం పోసిందనీ మర్చిపోకు
రక్తాన్ని చిందిస్తే యుద్ధం అవుతుందని అంగీకరించ వద్దు!!?

నక్షత్రాల్ని భూమికి దించాల్సిన 
అవసరం లేదు 
రాక్షసుల్ని దేవతలు
చంపాల్సిన అవసరం లేదు
అమ్మ పాల కుండలోనే అమృతాన్ని ఒక్కసారి తాగితే సరిపోతుంది !!?

వెన్నెలను గిన్నెలో పోసి
పంచామృతం కలిపి మనుషులను పసిపిల్లల్ని చేసి పంచిపెడితే
లోకంలో సంతోషం కడుపు నింపుతుంది!!?
ప్రతి ఇంటా కంటినిండా నిద్రలో
కలలు అన్నీ ఎర్రగా పండుతాయి!!?

ఆంజనేయుడు గుండెల్ని చీలిస్తే
కనపడేది సీతా రాముడే
ఆకాశం గుండె చీలిస్తే
ఎగిరేది తెలంగాణ జెండా యే !!?

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు