కవితాంజలి;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కవితాకుసుమాలను
పూయించి 
కళ్ళముందుపెట్టి
కనువిందులుచేయనా

కవితాసౌరభాలను
వెదజల్లి
మనసులనుతట్టి
మురిపించానా

కవితాకిరణాలను
ప్రసరించి
వెలుగులునింపి
పరవశింపజేయనా 

కవితాపఠనమును
కావించి
కర్ణములకునింపును
కలిగించనా

కవితాజల్లులను
కురిపించి
తనువులనుతడిపి
తరింపజేయనా

కవితాగంగను
పారించి
కల్మషాలన్నింటిని
కడిగిపారేయనా

కవితాకన్యకను
కలలోకినాహ్వానించి
కమ్మనివిషయాలనుచెప్పించుకొని
కవనంసాగించనా

కవితాసేద్యమును
కొనసాగించి
కమ్మనిపంటలనుపండించి
కడుపులునింపనా

కవనవిజయమును
పొంది
కవితాలోకమున
వెలుగొందనా

కవనాన్ని
కొనసాగించనా
కుతూహలపరచనా
కవితానందమునీయనా


కామెంట్‌లు