శ్రీనివాస్ నగర్ కాలనీ, పాల్వంచ మండలంలోని భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కు చెందిన తెలుగు భాష ఉపాధ్యాయుడు కవి బాణోత్ చెన్నారావుకి ముత్యాల హార పురస్కారం వరించింది. చెన్నారావు యస్ ఏ తెలుగు పండితులుగా ఎ.జి.హెచ్. యస్.డి.గొల్లగూడెం దమ్మపేట మండలంలో విధులు నిర్వహిస్తున్నారు.
తెలుగు భాష మీద ఆసక్తితో శతాధిక పద్యాలు లిఖించారు.
ప్రముఖ కవి రచయిత ఉపన్యాసకులు శ్రీ రాథోడ్ శ్రావణ్ రూపొందించిన ముత్యాలహారం నూతన లఘు కవిత ప్రక్రియలో సామాజిక అంశాల పై 102 పద్యాలు అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన సందర్భంగా చెన్నారావు
కు ముత్యాలహార పురస్కారాన్ని ఇటివల వాట్సాప్ వేదికగా అందజేశారు. ఈ పురస్కారం రావడం పట్ల ఉట్నూర్ సాహితీ వేదిక కవులు, రచయితలు
అతని, సహచర ఉద్యోగులు, ఉపాధ్యాయులు
కుటుంబసభ్యులు మిత్రులు హర్షం వ్యక్తం చేసారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి