*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 012*
 *చంపకమాల:*
*గురుతరమైన కావ్యరస | గుంభన కబ్బురమంది ముష్కరుల్*
*సరసులమాడ్కి సంతసిల | జాలుదురోటు శశాంక చంద్రికాం*
*కురముల కిందు కాంతమణి | కోటి స్రవించినభంగి వింధ్య భూ*
*ధరమున జారునే శిలలు | దాశరధీ కరుణాపయోనిధీ.*
*తా:*
దశరధ కుమారుడవు, కరణాశీలివి అయిన, రామా! కరుణ, భయం, ఆనందం, ఆశ్చర్యం మొదలైన రసానుభూతులతో ఎంతో గొప్పగా రాయబడిన కావ్యాన్ని, పండితులు అనందించినట్టుగా, మూరఖులు ఆనందించలేరు. జింక గుర్తుగా వున్న చంద్రుని నుండి వచ్చే కిరాణాలకు చంద్రకాంత శిలలి కరిగినట్టలు, విధ్య పర్వతాలలో వున్న బండ రాళ్ళు కరుగవుకదా! ........ అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*"చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు" అని ఒక శతకకారుని మాట. రావణ బ్రహ్మ పరమశివుని ప్రత్యక్షంగా చూడగలిగిన గొప్ప భక్తుడు, పండితుడు. ఆ పరమేష్టి ఆత్మలింగమునే పొందినవాడు. కానీ మూర్ఖుడు. పర స్త్రీ వ్యామోహం తనకు, కులానికి మంచిది కాదు అని ఎవరు ఎన్నివిధాల చెప్పినా, వినలేదు. పెడచెవిన పెట్టాడు. రామబాణానికి బలియై మూల్యం చెల్లించుకున్నాడు. ఇప్పుడు మన సమాజంలో కూడా ఇటువంటి వ్యక్తులు కనిపిస్తారు, వున్నారు. అటువంటివారిని కూడా మంచివారిగా మార్చమని భగవంతుని ప్రార్ధించడమే మనము చేయ గలిగిన, చేయ వలసిన పని. ఎందుకంటే, ఇటువంటి వారు మంచి వారిగా మారితే మన సమాజం ఇంకా అందంగా, నలుగురుకీ సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ విధమైన కోరికతో మనం పరమేశ్వరుని ప్రార్ధిస్తే అయన సంతోషించి అనుగ్రహిస్తాడు.....*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు