*ఉత్పలమాల:*
*దారుణ పాత కాబ్దికి స | దా బడబాగ్ని భవాకులార్తి వి*
*స్తార దవానలార్చికి సు | ధారసవృష్టి దురంత దుర్మతా*
*చార భయంక రాటవికిఁ | జండ కఠోర కుఠారధార నీ*
*తారకనామ మెన్నుకొన | దాశరధీ కరుణాపయోనిధీ.*
*తా:*
రఘువంశ తిలకా, కరుణా సముద్రము వంటి వాడవు,దశరధరామా! నీ తారక నామము, పాపములు అనే సముద్రములో పుట్టే బడబాగ్నిని ఆర్ప గలిగేది, సంసారమనే దారుణమైన నిప్పు ను చల్లార్చ గలిగేది, చెడు ఆచారములనే అడవిని నరకి వేయగల పదునైన గొడ్డలి వంటిది........ అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*"నామ" ప్రాభవం మరొక్కసారి నొక్కి ఒక్కాణిస్తున్నారు కవి. రామ నామ ప్రభావంతో సీతారాములను తన హృదయ ఫలకంలో ప్రతిష్ఠించుకున్నాడు, హనుమ. రామ పట్టాభిషేక సమయంలో, విలువైన ముత్యాల మాల సీతమ్మ హనుమకు తన స్వహస్తాలతో ఇస్తే కూడా, ఆ ముత్యాల లలో రామనామము కోసం వెతికి కనపడలేదని అవతలకు విసిరి వేస్తాడు. రామ నామాన్ని తలచుకుని సముద్రపు నీటిలో వదిలితే రాళ్ళు, నీటిలో మునగలేదు, నీటిపై తేలియాడే లాగా చేసింది రామ నామం. అంతటి మహిమాన్వితమైన రామా నామాన్ని సొంతం చేసుకుని మన జీవితాన్ని జీవన ఆవలి తీరాన్ని చేరే ప్రయత్నం చేసేలా మనకు దారి చూపమని ఆ పంకజనాభుని, పరంధాముడైన, రావణ సంహారిని ప్రార్ధించుకుందాము......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి