*శ్రీ శివపురాణ మాహాత్మ్యము**రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము-(౧౦౯ - 10 9)*

 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*సృష్టి వర్ణన*
*బ్రహ్మ, నారదుడు, రుషులు, దేవతలతో ఇలా చెప్పాడు -
*సదాశివుడు, శ్రీహరి ఇచ్చిన ఆదేశము ప్రకారము సృష్టి చేయడానికి సంకల్పించి  దోసిలిలో నీరు తీసుకుని, వారిద్దరినీ తలచుకుని పైకి వెదజల్లాను.అలా నేను వెదజల్లిన నీటి నుండి 24 తత్వముల సమూహము అయిన ఒక అండము వెలువడింది. కానీ ఆ అండము అచేతనముగా వుంది. ఎటువంటి చలనము లేకుండా వుంది. అప్పుడు నేను విష్ణుమూర్తి గురిచి 12సం. తీవ్రమైన తపస్సు చేసాను. ఈ తపస్సు పూర్తి అవగానే నామీద అత్యంత అనురాగముతో ప్రత్యక్షమైన విష్ణుమూర్తి ని అచేతనముగా వున్న 24 తత్వముల సమూహానికి చేతనత్వాన్ని ఇవ్వమని అడిగాను. అప్పుడు విష్ణు భగవానుడు, శివుని ఆజ్ఞయందు నమ్మకముతో ఆ అండములో ప్రవేశించాడు. అండములో ప్రవేశించిన వుష్ణు శక్తి పరమపురుషుని వేనవేల తలలతో, కన్నులతో, చేతులు, కాళ్ళతో అన్ని వైపులా వ్యాపించి అండమును కూడా భూమండలమంతా వ్యపించ చేసాడు. అప్పుడు అండము సచేతనము అయ్యింది. భూమి క్రింద వున్న పాతాళ లోకము నుండి పైన వున్న సత్యలోకము వరకు అండము వ్యాపించింది. ఆలా వ్యాపించిన అండములో విష్ణు భగవానుడు కొలువై వున్నాడు. ఆ విధంగా అండమున వున్న పరమపురుషుడే "వైరాజ పురుషుడు" అయ్యాడు.*
*అన్ని లోకముల కంటే పైన వున్న కైలాసమును తన నివాసముగా చేసుకున్నాడు శివ మహాదేవుడు. ప్రళయ సమయంలో కూడా కైలాసము, విష్ణలోకము, నేను ఉండే సత్యలోకము నాశము కావు. పరమేశ్వర పరాత్పరుని ఆజ్ఞ తోనే లోకాలను సృష్టి చేయాలి అనే అలోచన నాకు కలిగింది.  సృష్టి చేయాలి అనే ఆలోచన రాగానే నాలో పాపములకు కారణమైన తమోగుణము కనిపించినది. ఇది అవిద్యా-పంచకముగా చెప్పబడుతుంది. తరువాత మళ్ళీ పరమశివుని తదేకంగా ధ్యానం చేస్తూ అనాసక్త భావాన్ని పొంది సృష్టి గురించి ఆలోచించ గా స్థావరములు అయిన వృక్షములు, కొండలు మొదలైనవి సృష్టింప బడ్డాయి. ఇది "మొదటి సర్గము". అంటే సృష్టి ప్రాంభము. ఇది పురుషార్ధము కాదు. కనుక నాచే సృష్టించ బడిన రెండవసర్గ పూర్తిగా దుఃఖతో నిండి వుంది. ఇది కూడా పురుషార్ధ సాధకము కాదు. దీనిని " తిర్యక్ స్రోతా"అని పిలువబడుతుంది. మరల సృష్టి చేయబడిన నాల్గవ సర్గ "సాత్విక సర్గము", దీనిని " ఊర్ధ్వ స్రోతా" అన్నారు. ఇది దేవ సర్గము. ఇది సత్యముతో వుండి, సుఖదాయకము అవుతుంది కానీ పురుషార్ధ సాధకము కాదు.*
*మళ్ళీ పరమశివుని ధ్యానము చేసి, ఇంకొకమారు సృష్టి కార్యం చేసాను. ఇప్పుడు "రజోగుణము" పుట్టింది. దీనిని "అర్వాక్ స్రతా" అన్నారు. ఇందులో ప్రాణులు మనుషులు. పురుషార్ధ సాధన చేయడానికి అధికారం కలవారు. తరువాత, భూతాదుల సృష్టి చేసాను. ఈ విధంగా తమోగుణము, దుఃఖము, సత్వగుణము, సత్యం, రజోగుణము లతో కూడుకున్న అయిదు విధాలైన సృష్టి ని చేసిన విదము నీకు వివరిచాను.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss
కామెంట్‌లు