*శ్రీ శివపురాణ మాహాత్మ్యము**రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము - (౧౦౨ - 102)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*భగవానుడు అయిన శివుని గొప్పతనము - శివపూజ చేసుకోవలసిన అవసరము*
*నారదుడు: "బ్రహ్మ దేవా! మీరు, ప్రజాపతి ఇద్దరూ కూడా ఎల్లప్పుడూ శివ ధ్యానం లో వుండడం వల్ల ధన్యలు అయ్యారు. అందరినీ ధన్యలను చేయగల శివ మహిమ గురించి ఇంకా వివరముగా చెప్పండి" అని అడిగాడు.*
*బ్రహ్మ: "ఓ నారదా! పూర్వము ఒకప్పుడు నేను ఈ చరాచర జగత్తు లో వున్న రుషులను మునలను తోడు తీసుకుని లక్ష్మీ నారాయణుడు కొలువుండే పాలసముద్రపు ఒడ్డుకు తీసుకు వెళ్ళి, నువ్వు అడిగినట్లు గానే మేము కూడా శివ మహిమను వివరించమని అందరినీ పెంచి పోషించే కమాలక్షుని అడిగాము. దానికి ఆ సహస్రనామ ధారి ఇలా చెప్పాడు."
*ఒక ఘడియ కానీ, క్షణ కాలము కానీ శివపూజ జరగక పోతే అదే మానవ లోకానికి హాని కలిగించే విషయం. శివపూజ చేయకపోవడం నీచము, నికృష్టము, గుడ్డితనము, మూర్ఖత్వము కూడా. సదాశివుని మీద భక్తి కలిగి వున్నవారు, మనస్సు లో ఆ స్వామిని ప్రతీ క్షణము తలచుకుంటూ, నమస్కారం చేసుకునేవారిని, ఎప్పటికీ కష్టాలు తాక లేవు."
*శ్లో: భవభక్తి పరా యే చ భవప్రణత చేతసః !*
*భవసంస్మరణా యే చ న తే దుఃఖస్య భాజనాః !!*
                                   (శి.పు.రు.సృ.ఖం. 12/21)
*ఇలా నిరంతరమూ శివ ధ్యానం లో వున్నవారు ఎంతో పూర్వజన్మ పుణ్యం సంపాదించుకున్నవారు అయి వుంటారు. వీరికి చక్కని అందమైన భవనాలు, అందమైన ఆభరాణాలు ధరించిన స్త్రీలు, ఇక చాలు అనుకునేంత ధనము, పుత్రపౌత్రాది సంతానము, ఆరోగ్యము, అందమైన శరీరము, తట్టకోలేనంత గొప్ప కీర్తి ప్రతిష్టలు, చిట్టచివరకు మోక్షము కూడా దొరుకుతాయి. శివపూజ లో మన మనస్సు కదలకుండా వుడాలన్నా మనకు పూర్వ పుణ్య ఫలము అండగా వుండాలి. ప్రతీ రోజూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివలింగమును పూజించే మనుషులు అన్ని విధాలైన ఫలితాలను అనుభవించ కలుగుతారు. ఇటువంటి వారికి పాపపు పనులు చేయాలి అనే ఆలోచన రాదు.*
*నారాయణుని మాటలు శ్రద్దగా విన్న తరువాత మేము పూజ చేసుకోవడానికి అనువుగా వుండే శివలింగమును మాకు ఇవ్వమని అడిగాము. లక్ష్మీపతి, విశ్వకర్మను పిలిచి శివలింగమును తయారు చేసి మాకు అందరికీ ఇవ్వమన్నాడు. అప్పుడు విశ్వకర్మ, వారి వారి అర్హతలను బట్టి మాకు అందరికీ శివపూజ చేసుకోవడానికి "శివలింగాన్ని" ఇచ్చాడు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు