*శ్రీ శివపురాణ మాహాత్మ్యము**రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము - (౧౦౩ - 103)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*భగవానుడు అయిన శివుని గొప్పతనము - శివపూజ చేసుకోవలసిన అవసరము*
*బ్రహ్మ, విష్ణువు లనుండి అనుజ్ఞ పొందిన విశ్వకర్మ, ఇంద్రునకు పద్మరాగమణితో చేయబడ్డ శివలింగము, కుబేరునకు సువర్ణమయ లింగము, ధర్మరాజు నకు పీతమణితో చేయబడ్డ లింగము, వరుణ దేవునకు శ్యామ వర్ణ లింగము నకు శివపూజ చేసుకోమని ఇచ్చాడు. విష్ణుమూర్తి ఇంద్రనీలమయ లింగము, బ్రహ్మ హేమమయ లింగమును పూజిస్తారు. విశ్వదేవ గణము వెండితో చేయబడిన లింగము, వసుగణములు, అశ్వనీ కుమారులు ఇత్తడితో చేసిన పార్ధివ లింగమును పూజిస్తారు. లక్ష్మీ దేవి స్పటికమయ లింగమును, ఆదిత్య గణములు తామ్రలింగమును, సోముడు ముత్యాలతో చేసిన లింగమును, బ్రాహ్మణ శ్రేష్టులు వారి భార్యలు మట్టి తో చేసిన శివలింగమును పూజిస్తారు. ఈ విధంగా దేవతలందరికీ వారి వారి అర్హతలను బట్టి వేరు వేరు శివలింగమును తయారు చేసి ఇచ్చాడు విశ్వకర్మ, విష్ణుమూర్తి ఆజ్ఞ ప్రకారము. శుభములు ఇచ్చే శివలింగమును ఇచ్చిన విష్ణుమూర్తి, శివపూజ విధానము కూడా వారికి చెప్పాడు.  ఈ శివపూజ అన్ని కోరికలను కోరిన వారి అర్హతను బట్టి, వారికి మంచి చేసే కోరికలను మాత్రమే తీరుస్తుంది.*
*మనిషి జన్మ లభించటం చాలా దుర్లభం. అందులో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం ఇంకా కష్టం. మరి అటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వారు తాము చేయవలసిన ఉత్తమ కర్మలను ఆచరించాలి. ఏ జాతి వారు ఏ కర్మ చేయాలి అని చెప్పబడిందో వారు ఆ పనిని తప్పకుండా చేయాలి. తమకు ఉన్నంతలో దానం చేయాలి. క్రియతో కూడిన యజ్ఞము కంటే తపస్సు గొప్పది. వేలకొలది తపస్సు కంటే జప యజ్ఞము గొప్పది. లక్షలకొలది జపయజ్ఞము కంటే ధ్యాన యజ్ఞము గొప్పది. ధ్యానము వల్ల జ్ఞానము పొందవచ్చు. ఒక యోగి ధ్యానములో వుండి పరమేశ్వరుని సాక్షాత్కారం పొందగలుగుతాడు.*
*శ్లో: ధ్యానయజ్ఞాత్పరం నాస్తి ధ్యానం జ్ఞానస్య సాధనం !*
*యతః సమరసం స్వేష్టం యోగీ ధ్యానేన పశ్యతి !!*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు