బ్రహ్మ, నారద సంవాదంలో.....
*సర్వోత్తమమైన శివపూజ విధాన వర్ణన*
*బ్రహ్మ, నారదుడు, రుషులు, దేవతలతో ఇలా చెప్పాడు - భగవంతుని ఉపాసన చేయాలి అనుకొన్న ఉపాసకుడు, బ్రాహ్మీ ముహూర్తం అంటే తెల్లవారు ఝామునే మెలుకువ తెచ్చుకుని, కళ్ళు మూసుకుని చేతులు జోడించి, " నా లోనే వున్న దేవదేవా! త్వరగా మేలుకో స్వామీ! అందరికీ మంచి చేయవలసిన సమయం వచ్చేసింది. నీవు సర్వ మంగళుడవు. నీవు అభయప్రదాతవు కదా! నాకు ధర్మ మార్గం పరిచయం వున్నా, ఆదారిలో వుండ లేక పోతున్నాను. పరిచయం లేని అధర్మ మార్గంలో మాత్రం వెళ్ళే ప్రయత్నమే ఎప్పుడూ చేస్తున్నాను. నా మనసు లో వున్న నీవు ఎలా ప్రేరేపిస్తే అలా నడచుకోవడానికి నేను సిద్ధంగా వున్నాను." అని భగవంతుని కి, గురువులకు, తల్లిదండ్రులకు నమస్కరించి, దంతధావనము చేసుకుని, దక్షిణ దిక్కున మలమూత్ర విసర్జనము కావించి, కాళ్ళూ, చేతులు శుభ్రముగా కడుగుకోవాలి. నదిలో గానీ, చెరువులో గానీ, కుదరకపోతే ఇంటిలో గానీ చక్కగా స్నానము చేయాలి. దేశకాలమునకు వ్యతిరేకంగా స్నానము చేయకూడదు.*
*ఆదివారం, శ్రాద్ధ సమయంలో, సంక్రాంతి రోజు, మహాదానము ఇచ్చే టప్పుడు, గ్రహణము పట్టినప్పుడు, తీర్ధములలో, ఉపవాసము ఉన్నప్పుడు, మైల వచ్చినప్పుడు వేడినీటితో స్నానము చేయకూడదు. నీటి ప్రవాహానికి ఎదురుగా ఉత్తర, తూర్పు ముఖముగా వుండి స్నానము చేయాలి. ప్రతీ రోజూ తలకు నూనె పెట్టుకుని స్నానము చేసే వారికి నిషిద్ధ దినములు ఏవీ లేవు. కానీ, గ్రహణము పట్టిన రోజు నువ్వుల నూనె రాసుకోకూడదు.*
*రాత్రి పడుకునేటప్పడు కట్టుకున్న బట్ట కట్టుకుని స్నానము చేయకూడదు. మంచి బట్ట కట్టుకుని, ఇష్ట దైవాన్ని తలచుకుంటూ స్నానము చేయాలి. ఇతరులు వాడిన వస్త్రం, వస్తువులు వాడుతూ స్నానము చేయకూడదు. విడిచిన బట్ట శుభ్రము చేసుకుని స్నానానికి వాడవచ్చు. స్నానము చేసే టప్పుడు తర్పణము విడవాలి. తరువాత, శుభ్రపరచిన చక్కని బట్ట కట్టుకుని ఆచమనము చేయాలి. ఆవు పేడతో అలికిన చోట చక్కని దర్భాసనము వేసుకుని, దానిపైన మంచి శుభ్రమైన బట్ట వుంచి కూర్చుని, భస్మధారణ చేయాలి. భస్మం దొరకనప్పుడు నీటితోనే త్రిపుండ్ర ధారణ చేయాలి. రుద్రాక్ష వేసుకోవాలి. భస్మధారణ చేసి, రుద్రాక్ష ధరించి చేసే పూజ లేక పని చక్కని ఫలితాలను ఇస్తుంది.*
*మూడుసార్లు మంత్రము చెపుతూ ఆచమనము చేసి, శివపూజ కోసం, మంచి నీటిని, అన్నమును, మిగిలిన అనేక వస్తువులు, పదార్థాలు సిద్ధం చేసుకోవాలి. పసుపు, కుంకుమ, గంధము, జలము వున్న పాత్రను కూడా సిద్ధం చేసుకోవాలి. అర్ఘ్య పాత్రను కుడివైపు వుంచు కోవాలి. తరువాత, కుల గురువు ను ధ్యానం చేసుకుని, మనసు లోని కోరికలను చెప్పుకుని, సంకల్పం చేయాలి. అమితమైన భక్తి పారవశ్యంతో శివపూజ చేయాలి. ముందుగా గణపతిని ఆవాహన చేసి, పూజ చేయాలి. తరువాత, స్కందుని, అంబను, మిగతా పరివారానికి కూడా పూజ చేయాలి. ద్వార పాలకులను కూడా పూజించాలి. చందనము, ధూప, దీప, నైవేద్యం మొదలైన ఉపచారాలు చేయాలి. ఇంటిలో శక్తిని బట్టి, మట్టి, బంగారము, వెండితో తయారు చేయబడిన శివ ప్రతిమలకు పూజ చేయాలి. ఒక్క శివమహాదేవుని పూజ చేస్తే అందరి దేవతల పూజ చేసిన ఫలం దక్కుతుంది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి