ఆట వెలది పద్యాలు;-కె.అక్షయ10వ తరగతి ఈ/యంజి.ప.ఉ.పా.కుకునూర్ పల్లి,కొండపాక మండలం,
 1.
వాన కాలమందు వరద నీరును చేరు
కాచి త్రాగ వలయు కచ్చితముగ
అట్లు చేయకున్న ఆరోగ్యము చెడును
అక్షయాడు మాట అద్భుతమ్ము.
2.
పల్లెలన్ని చూడ పచ్చదనము తోడ
పంట పొలములన్ని పరవశించె
చేతినిండ పనులు చిక్కెను ప్రజలకు
అక్షయాడు మాట అద్భుతమ్ము.


కామెంట్‌లు