*శ్రీ శివపురాణ మాహాత్మ్యము**రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-( 118 )*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*సంధ్య తపస్సు - శివుని స్తుతి - మేధాతిథి యజ్ఞమునకు వెళ్ళుట*
*బ్రహ్మ, నారదుని ఇలా చెప్పాడు -*
*నారదా! వశిష్ఠుని వలన తపో విధానమును తెలుసుకున్న సంధ్య బృహల్లోహిత సరోవర తీరంలో తపస్సు చేయడానికి యోగ్యమైన రూపంలో, వశిష్ఠుడు ఉపదేశించిన మంత్రమును మనసులో వుంచుకుని, పరమ భక్తి భావనతో నాలుగు యుగముల కాలము శంభుని గూర్చి సుదీర్ఘమైన తపస్సు చేసింది. ఇంత సుదీర్ఘ కాలము, ఏకాగ్రతతో సంధ్య చేసిన తపస్సుకు మెచ్చిన సాంబశివుడు సంతోషించి ఆమె ఎదుట ప్రత్యక్షమై నిలిచాడు. తాను కొలుస్తున్న దేవదేవుడు ఒక్కసారిగా ఎదురుగా కనిపించే సరికి సంధ్య సరిగా చూడ లేక పోయింది. మళ్ళీ, ఆ నిర్గుణ రూపుని ధ్యానించి కనులు మూసుకోగా, సదాశివ సమా రంభుని రూపము సంధ్య హృదయంలో కనిపించి ఆమెకు దివ్య దృష్టిని, జ్ఞానాన్ని ఇచ్చాడు. అప్పుడు తనకు లభించిన దివ్య జ్ఞానం తో సాంబసదాశివుని చూచి వేయి వేయి విధాలుగా కీర్తిస్తూ, నామ సంకీర్తన చేస్తూ నమస్కారం చేసింది.*
*బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను గురించి తెలుసుకోలేరు. నేను మానవ జాతిలో పుట్టిన స్త్రీ ని నిన్ను తెలుసుకుని స్తుతించడం సాధ్యమా! మీరు నిర్గుణులు. తపోధనులు. మీకు పదే, పదే నమస్కరిస్తున్నాను. నా మీద దయతో ప్రసన్నుడవు అవు తండ్రీ! అని ప్రార్ధించిన సంధ్య తో శివభగవానుడు ఇలా పలుకుతాడు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు