“నా ప్రతీక్షణం నీ కోసమే” కవిత మాలిక - ధారావాహిక 3.;---- రవి బాబు పిట్టల.
మేమే గుడ్లగూబలం...అంగట్లో ఆటబొమ్మలం...
బలవుతున్న అపురూపు పక్షులం...
కాళ్ల రెక్కలకు బంధాలేేస్తున్నారు...
నల్ల బజార్లలో సీక్రెట్ గా అమ్మేస్తున్నారు...
మా అనుబంధాలకు దూరం చేస్తున్నారు...
మా మోర ఆలకించండి...మమ్మల్ని వదిలేయండి...!

పురాణాల్లో కొందరు మమ్మల్ని ప్రత్యేకమంటే...
కొందరు అనర్థం, అసహ్యం, అరిష్టమంటున్నరు...
లక్ష్మీదేవి పక్కన నిలబెట్టి...పూజలు చేస్తున్నరు, 
పురాణాలు చెబుతున్నరు...
అష్టైశ్వర్యాలొస్తాయని శుభశకునం అంటున్నరు...
అంతలోనే మా మొహం చూస్తే అశుభమని చెప్పుకుంటున్నారు...

మీ పగలు తీర్చుకోవడానికి మీ శత్రువులకు అరిష్టమని చూపిస్తున్నారు...
పైశాచికానందంతో ఉప్పొంగి పోతున్నారు...
క్షుద్ర పూజ, మాయమంత్రాలలో బలిస్తున్నరు...
మూఢ నమ్మకాలలో తరిస్తున్నరు...
ఆధారంలేని ఆచారాలను వదిలేయండి...
మమ్మల్ని ఆనందంగా జీవించనివ్వండి...

మారూపం మాకపురూపమైతే...వాళ్లకు మాత్రం అసహ్యం...
మా చూపులు వెక్కిరిస్తున్నరు...
మా అరుపులు భయమంటున్నరు...
పొరపాటున మీ ఇళ్లలోకొస్తే ... ఆ ఇళ్లనే వదిలేస్తున్నారు...
మరి ఎందుకు మమ్మల్ని అమ్మేస్తున్నారు?..
మీరు తెలివైన వారు కదా...దయచేసి ఆలోచించండి...

తర్పీదు పొందుతున్నరు...వల పన్నుతున్నారు... 
ఎర వేస్తున్నరు బోనుపెడుతున్నరు...
ఉచ్చు పెడుతున్నారు పట్టేస్తున్నరు...
వేటాడుతున్నరు వేదనకు గురిచేస్తున్నరు...
మా రెక్కలు మెలికేస్తున్నరు... మా కాళ్లను కట్టేస్తున్నరు...
మాపై దయ చూపండి... మమ్మల్ని వదిలేయండి...!

మా అడవులను నరికేస్తున్నరు... మా గుళ్ళను పీకేస్తున్నరు...
మా గుడ్లను చిదిమేస్తున్నరు... మా పిల్లల్ని పిసికేస్తున్నారు...
అనుబంధాన్నిచ్చిన అడవికి దూరం చేస్తున్నరు...
మూఢనమ్మకాలకు బలి చేస్తున్నరు...
మాపై కరుణ చూపండి... మమ్మల్ని వదిలేయండి...!

హాయిగా విహరిస్తున్న మా విహంగాలను విరిచి... బిక్కుబిక్కుమంటూంటే... పంజరంలో బంధిస్తున్నరు...
గుట్టుచప్పుడు కాకుండా బందీలుచేస్తున్నరు...
అక్రమంగా చీకటి బజార్లలకు తరలిస్తున్నరు... 
మాపై జాలి చూపండి... మమ్మల్ని వదిలేయండి...!

ఆర్తనాదాలతో ఏడుస్తుంటే...బేరాలు కుదుర్చుకుంటున్నరు... డబ్బులకు అమ్మేస్తున్నారు...
ఒంటరితనపు భయంతో అరుస్తుంటే... మందు వేసి పడుకో పెడుతున్నారు...నల్ల బజార్లలో సీక్రెట్ నల్ల బజార్లలో అమ్మేస్తున్నరు...

ఆకలితో కేకలు వేస్తుంటే...కుళ్లిపోయిన మాంసమేస్తున్నరు...
రోగమొచ్చి మూలుగుతుంటే...సత్తామణి
జీవముండగానే ముక్కుపీకేస్తున్నరు...గోళ్లు నరికేస్తున్నరు...
వాటిని కూడా మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నరు... మీరు కొనకుండా, ఉపయోగించకుండా సహకరించండి...

మా చట్టాలను పంజరాల్లో కమ్మేస్తున్నరు...
మీ చుట్టాలకు లక్షల్లో నల్ల బజార్లలో అమ్మేస్తున్నారు...
ఇకనైనా మమ్మల్ని కరుణించండి...
మా అడవుల్లో మమ్మల్ని వదిలేయండి...
ప్రకృతిని రక్షించండి తరతరాలు హాయిగా జీవించండి...?

పంచ భూతాలే కవితాక్షరమాలతో మనిషిని అర్జించిన వేళ...ఈ “నా ప్రతీక్షణం నీ కోసమే” - 3. 
(సశేషం...).


కామెంట్‌లు