దైవత్వం దర్శించు;-పి. చైతన్య భారతి 7013264464
సృష్టిని నడిపించువాడు 
దృష్టికే అందనివాడు 
అజ్ఞాన లుప్తంబుతో 
ఆత్మచైతన్యంబతడు 

జన్మజన్మల ఖర్మబు 
తుడిచేయునీధ్యానంబు 
భవసాగరం దాటించి 
పరమాత్మతో నైక్యంబు 

చిదిమేయు చీకట్లను 
తొలగించు ఇక్కట్లను 
నిండుజాబిలి వెలుగులే 
నీ మదిలో నలుముకొను 

అనునిత్యం ఎరుకపెట్టు 
శ్వాసమీద ధ్యాసపెట్టు 
వ్యర్థమైన చింతనంత 
సాధనతో  కట్టిపెట్టు 

మనసంత నిశ్చలమౌను 
అలలు లేని సoద్రమౌను 
అరుణకాంతి ఆ

త్మవెలిగి 
కరుణకాంతి పూజ్యుడౌను 

అహింసనూ ఆచరించు 
మూగజీవుల ప్రేమించు 
అమితమైన ప్రేమతో 
దైవత్వమే  దర్శించు 


కామెంట్‌లు