కావలసినది అద్వైతం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం94928 11322
 అన్ని భాషలకు మూలం సంస్కృతం అని ఒక వాదన.  ఆంధ్ర భాషలో ఉన్న 56  అక్షరాలలో 19 అక్షరాలు సంస్కృతమే అవి లేకపోతే మన భాష పరిణతి చెందిన, పరిపూర్ణ భాష కావడానికి అవకాశమే లేదు. భారతదేశంలో కేరళ రాష్ట్రం వారు వాడినన్నిసంస్కృత శబ్దాలు మరి ఏ రాష్ట్ర ప్రజలు వాడారు. తెలుగులో కొండను  పర్వతమని, కుండను  ఘటమని, ఉప్పును లవణం అని వాడతారు వేరు వేరు భా షల్లో చెప్పిన అర్థం ఒకటే భగవద్గీతలో భగవంతుని గురించి చెప్పిన ఒక వాక్యం ఉంది. ఎవరు ఏ పేరుతో,  ఏ భాషలో, ఏ ప్రాంతంలో  మాట్లాడినా అది నాకే చెందుతుంది అని కానీ మనం కులాల పేరుతో మతాల పేరుతో  ద్వేషాలను పెంచుకుంటూ ఒకరికొకరు దూరంగా ఉంటున్నాం. అలా ఉండటం కాదు అని చెప్పడమే వీరి పరమ లక్ష్యం. తత్వాన్ని అర్థం చేసుకుంటే అంతా ఒకటే  రాముడు, కృష్ణుడు, అల్లా, ఏసు లాంటి పదాలను మనం ఉపయోగించుకున్నా అన్నీ ఒక తత్వానికి సంబంధించినవే ఒక రకమైన జీవనానికి అలవాటు చేసేవి. మనుషులతో కలిసి జీవించి ఉండాలి కలహాలు లేకుండా ఉండాలి ఒకరికొకరు సహకరించుకుంటూ  సాయపడి  సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆశయం అందుకే ఈ భక్తి మార్గం. ప్రతివాడు పరతత్వాన్ని ఆలోచించినప్పుడు  ద్వైతం మాయమై అద్వైతం మాత్రమే నిలుస్తుంది అన్నది వేమన చెప్పిన నీతి.


కామెంట్‌లు