దక్షిణాది నుంచి రాజ్యసభకు నలుగురిని ఎన్నుకోవడం అందరికీ గర్వకారణం సరైన వ్యక్తులనే ఎనుకున్నారు. నేను గురువు గారు నండూరి సుబ్బారావు గారు మాంగుళూరు వెళ్ళి సన్మాన కార్యక్రమం అయిన తరువాత తిన్నగా ధర్మస్థలి వెళ్లాం. అక్కడ వీరేంద్ర హెగ్డె గారు ప్రశాంతంగా కూర్చున్నారు. వారి మాటల్లో సౌమ్యత, ఆదరణ, ఆప్యాయత అనురాగం, భక్తి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఎంత మంది భక్తులు వచ్చిన అందరికీ కడుపునిండా భోజనాలు పెట్టడం ఆయన నియమం. విశేషమేమిటంటే భోజనాల సమయంలో ధర్మస్థలిలో ఏ ఒక్క హోటల్లో భోజనం దొరకదు. మాకు సకల మర్యాదలు చేసి భోజనాలు వారి గదికి తెప్పించి మాతోపాటు నిరాడంబరంగా భోజనం చేశారు. ఆ గ్రామంలో ఇరువురి మధ్య తగాదా వస్తే ఇద్దరూ హెగ్గడే గారి దగ్గరికి వస్తారు. వారిని రేపు రమ్మని చెప్తారాయన తెల్లవారి వారిద్దరిలో ఒకరు తప్పు ఒప్పుకొని క్షమాపణ చెబుతాడు. ఎందుకు అలా చెబుతున్నావు అంటే రాత్రి స్వామివారు కలలో కనిపించాడు నా తప్పు నాకు తెలియజేశారు అని చెప్తాడు. మంజునాథీశ్వర అంటే అంత భక్తి, నమ్మకం, విశ్వాసం వెంకటేశ్వర స్వామికి కనకదుర్గమ్మ తల్లికి ఎలా పూజలు జరుగుతాయో అక్కడ స్వామికి అలా జరుగుతాయి. ఏ లోటు రావడానికి వీలు లేదు.
ఆయన చేసే ప్రజాసేవ ఇంకెవరూ చేయలేరు అంటే అది అతిశయోక్తి కాదు. స్వామి పేరుతో విద్యాసంస్థలను ఏర్పాటు చేసి విలువైన విద్యను చెప్పించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దటం సామాన్యమైన విషయం కాదు. ఆ పరిసర ప్రాంతాలలో ఎక్కడ ఏ అవసరం వచ్చినా నేనున్నానని ముందుకు దూకే వ్యక్తి హెగ్డె గారు మా భోజనాలు అయిన తరువాత స్వామి విగ్రహాన్ని ఇచ్చి మా ఇద్దరిని జ్ఞాపికలతో సత్కరించారు. వారిని కలిసి మాట్లాడి ఆప్యాయతను పంచుకోవడం మా పూర్వజన్మ విశేషం ప్రభుత్వం తరఫున ఈ గౌరవం దక్కింనందుకు మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి