తేలప్రోలు పేరంటాలమ్మ;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322
 మా గ్రామం తేలప్రోలు  మా గ్రామ దేవత పేరంటాలమ్మ  జక్కా వారి ఇంటి  ఆడపడుచు  చిన్నతనంలోనే మరణించి దేవతగా వెలిసింది  అనేక నిదర్శనాలతో  ప్రజలను ఆకట్టుకుంది ప్రతి సంవత్సరం మూడు రోజులు ఆమె పేరుతో తిరునాళ్ళు జరుగుతూ ఉండేవి. ప్రస్తుతం తొమ్మిది రోజులకు పెరిగింది  ప్రభలు కట్టడంలో మా గ్రామం తర్వాతే  పరిసర ప్రాంతాల నుంచి  అనేక రకాల ప్రభలతో వచ్చి  అనేక రకాల విన్యాసాలు చేస్తూ మూడు పర్యాయాలు గుడి చుట్టూ తిరిగి అమ్మవారిని దర్శించుకుని  ఆమె ఆశీస్సులు పొంది వేడుకుంటారు. ఆ తిరునాళ్ళ రోజులలో  అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో రకమైన సేవ చేస్తూ ఉంటారు. చివరి రోజు ఉయ్యాల ఊగే సమయాల్లో  ఎన్ని వేల మంది  ఆ కార్యక్రమంలో పాల్గొంటారో చెప్పలేము. కొన్ని వందలమంది వ్యాపారస్తులు  లక్షలలో లాభాలు పొందుతారు ఆ తొమ్మిది రోజుల్లో.  ఇవాళ ప్రతి గ్రామంలోనూ గ్రామ దేవతలు వెలిశారు.  ప్రజలలో భక్తి భావాన్ని పెంచడానికి  ఇలాంటి సంఘటనలు పనికి వస్తాయి.


కామెంట్‌లు