పలుకవయ్య స్వామి;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322

 మానవుడు భగవంతుని గురించి తెలుసుకోవడానికి అనేక మంది గురువుల సాన్నిహిత్యం పొంది వారికి సేవలు చేసి వారి మనసులను ఆనంద పరచి తరువాత తన మనసులోని కోరికను చెప్పినప్పుడు  అది అంత త్వరగా సాధ్యమయ్యేది కాదు.  కానీ మనిషి తలుచుకుంటే అసాధ్యం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు  తపస్సుసమాధికి వెళ్లి  మానసికంగా వారిని తలుచుకుంటూ  అంకితభావంతో  పంచేంద్రియాలను కేంద్రీకరించి  ప్రయత్నం చేయమని  చెప్పగా అలాగేనని  తపస్సు చేయడానికి సిద్ధమై ఏకాంత ప్రదేశాన్ని ఎన్నుకొని  నిశ్చలమైన భక్తితో భగవాన్ నాకు దర్శనం ఇవ్వు నువ్వు ఎలా ఉన్నావో చూడాలని తపన ఉన్నది నాకు నీ స్వరూపాన్ని చూడాలని నీ మాట వినాలని ఉంది ఎంతో ఆరాటపడుతున్నాను  నాకు  కనిపించు అని వేడుకుంటూ తన తపస్సు కొనసాగిస్తాడు.
నీ పలుకులు వినాలని నేను చేస్తున్న తపస్సు ఫలించి దర్శనం ఇస్తావన్న నమ్మకంతో  నేనిక్కడ కూర్చున్నాను. స్వామీ పలక వయ్యా  నీ పలు కులో ఎంత కమ్మదనం ఉందో వినాలన్న నాతో ఎందుకు పలకడం లేదు?  నీ పలుకులు వినకుండా నాకు ఎలా తెలుస్తుంది నీ మనసు. నా జీవిత గమ్యాన్ని నీ ఆజ్ఞతో నెరవేర్చాలి అనుకుంటున్నాను. కరుణించి  నా కోరిక తీర్చవయ్యా అని ప్రార్థిస్తూ ఉంటాడు. నిజంగా  ఒక కార్యాన్ని 
సాధించాలన్న పట్టుదల ఉంటే  సాధించకపోవడం అంటూ ఉండదు. తగిన కృషి చేయి అని వేమన చెబుతున్నాడు.
కామెంట్‌లు