నటనలో దిట్ట మా శివప్రసాద్;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322
 విశాఖపట్నం ఆ పరిసర ప్రాంతాలలో జరిగే నాటక పరిషత్తులకు  తప్పకుండా హాజరయ్యే ముఖ్య నటుడు,  సంస్థ స్థాపకుడు, మంచి  దర్శకుడు ఆకాశవాణిలో కూడా చాలా నాటకాలులలో మంచి పాత్రలు వేశాడు. నాకు ఆత్మీయ మిత్రుడు  దర్శకత్వ మెళకువలు తెలిసిన వాడు  ఎవరితో ఎలా మాట్లాలి  తనకు కావలసినట్టుగా  
ఆ దృశ్యాన్ని మలచాలో తెలిసినవాడు.తన నాటకాల్లో చెప్పుకోదగిన విషయం మా విజయలక్ష్మి  ఆమె రేడియోలోనైనా సినిమాలోనైనా  రంగస్థలం మీదనైనా తన సొంత సంస్థ అనుకుని చేస్తుంది అంత అంకితభావంతో చేసే నటీమణులు చాలా అరుదు. ఆమె శివప్రసాద్ నాటకాలలో అప్పుడప్పుడు దర్శకత్వ బాధ్యత కూడా తీసుకుంటుంది. ఇంటి మనిషిగానే  ప్రవర్తిస్తుంది. కిరాయి నటిగా ఎక్కడ ఆమె జీవితంలో  ప్రవర్తించిన దాఖలాలు లేవు. ఆత్మీయత చూపడంలో ఆమె తర్వాతే. అది సాంఘికమైన, చారిత్మక మైన మరో ప్రక్క జానపదమైన వాట్లలో ప్రధాన మైన పాత్రలు ధరించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య  ఆమె చేసిన ప్రతి  నాటకం అన్ని మాధ్యమాలలో ను  విజయాన్ని సాధించింది. ఆమె ఈ సంస్థకు శాశ్వత నటిగా ఉండడం శివప్రసాద్ కు కలసి వచ్చిన అదృష్టం. వ్యక్తులు వ్యక్తిగతంగా తెలియకపోయినా వారి పేరు విని  వారిని గౌరవించే వారు చాలామంది ఉంటారు  అలాంటి వారిలో విశాఖపట్నంలో మా స్నేహితుడు  కె వి మెమోరియల్  అన్న సంస్థను స్థాపించి కే వి ఆర్  పేరుతో బహుమతులు  ప్రదానం చేస్తూ ఉంటాడు. దాని వెనక  ఆర్థిక సహాయం చేసేది  తిరుపతి రాజుగారు.  కే వెంకటేశ్వరరావు విజయవాడలో ర.స.న పేరుతో  శివ రామ రెడ్డి,  జి ఎస్ ఆర్ మూర్తి, సండూరి వెంకటేశ్వర్లు, కబీర్ దాస్ లాంటి నటులను సమీకరించి  దగ్గరుండి రచయితతో తనకు కావలసిన పద్ధతిలో నాటకాన్ని రాయించుకుని  చక్కగా రిహార్సల్స్ చేసి అనేక   నాటకాలను ప్రదర్శించారు. ఆ విషయాలు నా ద్వారా తెలుసుకొని వారి మీద గురు భావంతో ఆయన పేరుతో  శివ ప్రసాద్  నా దగ్గరికి వచ్చి జరుగుతున్న కార్యక్రమంలో గురువు గారి గురించి తెలిసిన వారు మీరు ఉన్నారు వారి గురించి చక్కటి ఉపన్యాసం ఇవ్వాలని అడిగితే వెళ్లి  తిరుపతి రాజు వారి సమక్షంలో వెంకటేశ్వరరావు గారి గురించి నాకు తెలిసిన సమాచారాన్ని చెప్పాను ఎంతో ఆనందించాడు భారీగా సన్మానం కూడా చేశాడు.  స్నేహానికి ప్రాణమిచ్చే  ఆత్మీయుడు మా శివప్రసాద్.  తిరుపతి రాజు గారు మరణించిన తర్వాత వారి పేరుతో కూడా ప్రతి సంవత్సరం కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం అతని  మంచితనానికి గుర్తు.

కామెంట్‌లు