మహా కవి దాశరథి (ఆయన జయంతి సందర్బంగా ) ప్రభాకర్ రావు గుండవరం--ఫోన్ నం.9949267638

 మాటలే ఆయుధాలుగా
తన కవిత్వమే అక్షరాయుధంగా
పాటలతో రచనలతో
నైజామ్ పాలనకు ఎదురోడ్డి పోరాడి
నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే గొంతుకను వినిపించిన
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు
 ప్రఖ్యాత కవి తన అభ్యుదయ భావాలతో విప్లవ భావాలతో 
ముందుకు సాగుతూ తెలంగాణకు కీర్తి తెచ్చిన తెలంగాణ మణి
దాశరథి కృష్ణమాచార్యులు గొప్ప సాహితీ వేత్త
తన వాడి రచనలతో వేడి వేడి మాటలతో 
నిజాం ను గడ గడలాడించిన యోధుడు తెలంగాణ కవి వీరుడు
"రైతుదే తెలంగాణం రైతుదే. ముసలి నక్కకు రాచరికంబు దక్కునే " 
అంటూ  తెలంగాణ సింహం లా గర్జీస్తూ  
రజాకార్లను బెదిరిస్తూ ఎదిరిస్తూ దిగిపో గద్దె వీడి 
మా తెలంగాణ మాకిచ్చి పో అంటూ
 సవాల్ చేసిన మహా కవి దాశరథి.
ఆయనకివే అక్షర నీరాజనాలు.
కామెంట్‌లు