ఇది మాయ కాలమే పిల్లా
నా మాట వింటూ
నా బాట నడుస్తూ
నా పాట పాడవే పిల్లా
నే చెప్పింది వినవే పిల్లా
ఇది మాయ కాలమే పిల్లా!!
నీ మాట జారకు
నీ మనసు విప్పకు
నివురుగప్పిన నిప్పు
తెల్లగా ఉన్నట్లు
మౌనంగ ఉండాలే పిల్లా
ఇది మాయ కాలమే పిల్లా !!
నిజం తెల్సే వరకు
నిప్పులాగుండాలే
అంత మనదే అయితే
అణిగి మణిగి ఉండాలే
నే చెప్పింది వినవే పిల్లా
ఇది మాయ కాలమే పిల్లా !!
మనుషులందరు ఒకటే
మానవత్వం ఒకటే
గుణములో భేదమే పిల్లా
మనిషి లోతు తెల్వదే పిల్లా
ఇది మాయ కాలమే పిల్లా !!
అంతా నీదే అంటు
తీయగా చెబుతారు
మంచి మాటలు చెబుతూ
మాయ చేస్తూంటారు
నీ గుట్టు విప్పకే పిల్లా
ఇది మాయ కాలమే పిల్లా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి