ప్రేమంటే తెలియని వారెవరు!(పాట )- ప్రభాకర్ రావు గుండవరం(మిత్రాజీ)-ఫోన్ నం 9949267638
మరచిపోము మరువలేము 
మనసున నాటిన మమతలనూ
మరువము ఆ తీయని స్మృతులనూ.............

కల కాదది నిజమేలే
మనము అనుభవించిన ప్రేమేలే
ఎవరు ఎందుకు ఎమన్నారనీ 
మన మనసే కదా దానికి సాక్ష్యం

// మరిచిపోమూ మరువలేమూ //

నీకు నేనే నాకు నీవే
మనమిద్దరమే ఈ లోకం లో
మధురమైన మన ఆనందాన్ని
పంచుకునేది మన హృదయాలే

కాదనే వారు లేనే లేరు
ప్రేమంటే తెలియని వారెవరు
మనకోసమే ఈ విశాల విశ్వం
చంద్రుని వెన్నెల మనదేలే

// మరిచిపోమూ మరువలేమూ //

భూమి ఆకాశం నీది నాదే
పంచ భూతములు అన్నీ మనవే
సాగర తీరం సంధ్యా సమయం
ఉషోదయము మన కోసమేలే

గగన వీధిలో తేలి పోదాం
ప్రేమ విహారం చేసేద్దాం
అందని స్వర్గన్ని అందుకుందాం
మన సంతోషానికి అవధేమిలే

// మరిచిపోమూ మరువలేమూ //

కామెంట్‌లు