ఏడుపాయల దుర్గమ్మ;- ప్రభాకర్ రావు గుండవరం(మిత్రాజీ)ఫోన్ నం.9949267638

ఏడుపాయల దుర్గమ్మ
మా తల్లివి నీవమ్మ
మనసు నిండ నిన్ను కొలిచేము
మరువక నిను తలచేము

కోరిన కోరికలు తీర్చే
కొంగు బంగారం నీవమ్మా
మహంకాళి భద్రకాళి
అవతారం నీవమ్మా

అఖిల జనుల కాపాడే
ఆది దేవతవు నీవే
సకల ప్రాణుల రక్షించే
సర్వేశ్వరివి నీవే

పోచమ్మ ఎల్లమ్మ
మైసమ్మ నీ పేర్లే
ముగురమ్మల రూపం తో
వెలిగే తల్లివి నీవే

పరాశక్తి పరంజ్యోతి
పరబ్రహ్మ స్వరూపిణీవి
నారాయణుని సోదరివి
పరమేశ్వరుని సతివి

మమ్మేలు మా తల్లీ
ఏడుపాయల దుర్గమ్మ 
నీ దయ ఉంటే చాలు
ఈ లోకం సుభిక్షంగ ఉండు
🌹🌹🌹

కామెంట్‌లు