అన్నీ ఉండాలి; - ప్రభాకర్ రావు గుండవరం--ఫోన్ నం.9949267638
అసూయ ఉండాలి
మనము ఎదుటి వారికన్నా బాగుపడాలని//

ఈర్ష్య ఉండాలి
మన వ్యక్తిత్వంతో మంచితనమనే స్థానం పొందాలని//

ద్వేషం రగలాలి
పోరాటం లో మనదే పై చేయి కావాలని//

పగతో ప్రజ్వరిల్లాలి
కష్టించి శ్రమించి సాధించాలని//

ప్రతీకారం తీర్చుకోవాలి
మనలో నాటుకుపోయిన మానసిక రుగ్మతలపై//


కామెంట్‌లు