తొలి ఏకాదశి;- ప్రభాకర్ రావు గుండవరం--ఫోన్ నం.9949267638
తొలకరి జల్లుతో
వచ్చే పండుగ
తొలి ఏకాదశి తొలుత పండుగ

నారాయణుని
నామ స్మరణతో
జగమంతా భక్తితో వేడే పండుగ

మునులు ఋషులు
దేవతలంతా
ఆది వరాహుని ఆరాధించే పండగ 

శ్రీ రంగడు శయనించే
సమయము
యోగ నిద్రలోకి వెళ్లే వేళా 
భువిపై రాత్రి పెరిగే సమయము

ఉపవాసం జాగరణతో
స్వామిని మెప్పిస్తూ
అభిషేకం అర్చనలతో
దైవ పూజ చేయాలి

నేటి పూజ ఫలితమే
సాటిలేని మోక్ష సంపద
జన్మ జన్మల పాపాలు
ప్రక్షాళన చేసే పుణ్య సంపద
🌹🌹🌹

కామెంట్‌లు