వినయం! అచ్యుతుని రాజ్యశ్రీ

 విద్యా దదాతి వినయం అన్నారు. నాకు మంచి మార్కులు వచ్చాయి మాఇంట్లో అంతా విదేశీ వస్తువులని ఇలా కొందరు గొప్పలు చెప్తుంటారు.సింప్లిసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ బ్యూటీ! సరళంగా  మంచి భావాలతో ఉండాలి. పక్కవారిని చూసి ఏడ్వరాదు...ఆరోజు వక్త అలా అనర్గళంగా చెప్తోంటే కాలేజీ పిల్లలు చప్పట్లు చరుస్తూ ఆనందం గా  కేరింతలు కొడుతున్నారు. వారానికోసారి ఆయన పిల్లల బుర్రలకి అంటుకునేలా మంచి విషయాలు  పావుగంట చెప్పి  మిగతా ముప్పావు గంట పిల్లల అభిప్రాయాలు చెప్పమంటారు. ఒక్కోక్లాస్ నించి ఒక్కొక్క విద్యార్థి పాలు పంచుకుంటారు.ఆరోజు శివా వంతు.శివా చెప్పసాగాడు"మనం ఆజాదీకా అమృత మహోత్సవ్ జరుపుకునే తరుణంలో గాంధీజీ లా సింపుల్ గా ఉండాలని నిశ్చయించుకున్నాను. నీట్ గా నాల్గు జతల తో సరిపెట్టుకుంటాను.పుట్టినరోజు నాపాకెట్ మనీతో అనాధపిల్లలకి బిస్కెట్లు  పళ్ళు పంచుతాను."సీత అంది" నేను గొప్ప వారి జీవిత చరిత్రలు చదువుతూ నచ్చిన పాయింట్లు  పుస్తకం లో రాసుకుని  చిన్న కథలు కవితలు  అల్లుతాను." గోపి అన్నాడు "నేను బిల్ గేట్స్ లా ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలని నిశ్చయించుకున్నాను. అబ్దుల్ కలాం ప్రెసిడెంటు గా పిల్లల తో అరమరికలు లేకుండా  హాయిగా గడిపారు. తనొక సైంటిస్టు అని మర్చిపోయారు.అలాగే ఇ.సి.ఐ.ఎల్.లో రిటైర్ఐన  ఎ.ఎస్.రావ్ గారు సిటీబస్సు ఎక్కి "నాకు డాక్టర్ ఎ.ఎస్.రావ్ నగర్ కి టికెట్ ఇవ్వండి "అని కండక్టర్ చేతిలో  డబ్బు పెట్టారు."సార్!మీపేర కాలనీ వెలిసింది. నేను డబ్బు తీసుకోను"అన్నాడు."నీడ్యూటీ నీవు చెయ్యి.డబ్బు ఇచ్చి టికెట్టు కొనటం నాధర్మం" అన్న పెద్ద మనిషి  నారోల్ మోడల్! గడ్డి పరకలు తుఫాను తాకిడికి తలొంచుతాయి.పెద్ద చెట్టు విర్రవీగి ఫెళఫెళావిరిగి నేలకొరుగుతుంది.అందుకే వినయంతో ఒదిగి ఉండే మనిషి గొప్ప వాడు అయితీరుతాడు.
కామెంట్‌లు