నానీలు :కోరాదనరసింహారావు

  మనం స్వతంత్రంగా 
   బ్రతికే  వరకూ.... 
      మనకు రెండుకాళ్ళూ 
         అమ్మా, నాన్నలే !
   *******
బిడ్డలపై తల్లి ప్రేమ 
 కనిపిస్తుంది  !
  కనిపించని తపనే 
    కన్నతండ్రి !!
  *****
వాత్సల్యo మమకారం 
   అమ్మప్రేమ !
    బరువు, బాధ్యతలు  
      భరించేది నాన్నే  !!
   ******
   ఆనాధను చెయ్యక 
     కంటికి రెప్పలా....
       అమ్మా, నాన్న 
         అనాధలై ఆశ్రమాల్లో !
       ******
బ్రతికుండగా 
  పట్టించుకోము 
    బహు బాగా చేస్తాం !
      అమ్మానాన్నల దినాలు !!
     *******
కామెంట్‌లు