సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
  ఒంట్లోకీ.. ఇంట్లోకీ...
  *******
 కొన్ని అలవాట్లు,సరదాలు  ఆనందంగా ఒంట్లోకి. ఆ తర్వాత  తెలియకుండానే ఇంట్లోకి ప్రవేశిస్తాయి.
అలవాట్లు సరదాల పట్ల అప్రమత్తత లేకుంటే చాపకింద నీరులా ప్రవేశించి జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతాయో గమనిస్తే , ఎన్నో నిజాలు బయట పడతాయి.
స్నేహితులతో  సరదాగా మొదలు పెట్టిన  చెడు అలవాట్లు, సరదాలు వ్యసనంగా  ఒంట్లో చేరుతాయి.  వాటి ప్రభావం ఇంట్లోకి  కూడా ప్రవేశించి  ఆర్థికపరమైన, హార్దిక పరమైన సమస్యలు చుట్టుముట్టేలా చేస్తాయి.
 అందుకే ఆదినుంచే అలాంటి వాటికి పూర్తిగా దూరం ఉండాలి.
మంచి అలవాట్లు,కలిమిడి తనం పెంచే సరదాలు అయితే ఫరవా లేదు. అటు  ఒంట్లో ఉత్తేజం పెంచి వ్యక్తిగా సమాజంలో గౌరవాన్ని,  ఇటు ఇంట్లో అందరి ఆదరాభిమానాలు పొందేలా చేస్తాయి.
 మన జీవితం మన చేతుల్లో ... మన అలవాట్లు మన చేతల్లో..
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు