తెచ్చుకునేవి...పుచ్చుకునేవి
******
మనిషి తన వెంట విడువకుండా తెచ్చుకునేవి రెండు.ఒకటి తనపై తనకున్న అపారమైన నమ్మకం. రేపటి గురించి భయపడకుండా ఓ చిన్న ఆశ.
అవి మనసుతో పాటు ఎప్పుడూ ప్రయాణం చేయాల్సిందే.
ఎప్పుడైతే అనుకోని సంఘటనలు ఎదురవుతాయో, సమస్యలు చుట్టుముట్టి బాధిస్తాయో... అప్పుడు కొందరు తనపై నమ్మకాన్ని, జీవితంపై ఆశను కోల్పోతారు.అంతులేని నిరాశా నిస్పృహలకు లోనవుతారు.
అప్పుడు రేపనేది అగమ్యగోచరంగా, అంధకారంగా కనిపిస్తుంది.
కాబట్టి ఎప్పుడూ వాటిని విడవకుండా వెంట తెచ్చుకోవాల్సిందే.
ఇక మనసు పుచ్చుకునేవి రెండు. అవి ధైర్యం, ఆత్మవిశ్వాసం.
మనసెప్పుడూ సున్నితమైనదే.
చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి గురై, కృంగి పోతుంది.
ఏమీ చేయలేననే నిర్ణయానికి వస్తుంది.
అలాంటప్పుడే అత్యంత ఆత్మీయులైన వారి నుండి కాసింత ధైర్యం, ఇంకాస్త ఆత్మ విశ్వాసాన్ని ఔషధంగా పుచ్చుకోవాలి.
ఇలా రేపటిని భయపడకుండా ఎదుర్కునేందుకు తెచ్చుకోవడం, పుచ్చుకోవడాలు తప్పని సరి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి