నిత్యం... నియమం...
******
ప్రతి నిత్యం మనం నియమబద్ధంగా చేయాల్సిన కృత్యాలు/ పనులు కొన్ని ఉంటాయి.
వాటిని నియమం ప్రకారం చేయకపోవడం వల్ల మానసిక శారీరక ఇబ్బందులు ఎదురవుతాయి.
ప్రతి నిత్యం నియమబద్ధంగా ఒకే సమయానికి లేవడం,ఒకే సమయానికి నిదుర పోవాలి.
ఇదంతా ఒక ఎత్తు అయితే రోజూ లేచే ముందు మనవల్ల ఎవరికీ ఇబ్బంది బాధ కలుగకూడదు అనుకోవాలి. అలాగే కలగనీయకుండా ఉండేందుకు ప్రయత్నించాలి.
నిదురించే ముందు రోజంతా చేసిన పనులను సమీక్ష చేసుకోవాలి. మన వల్ల పొరపాట్లు జరిగినప్పుడు వాటిని సవరించుకునే ప్రయత్నం చేయాలి.
ప్రతి ఉదయం అందమైనదే.ఏరోజు కారోజు ప్రత్యేకత తప్పకుండా ఉంటుంది. నిత్యం ఉత్సాహంగా, సృజనాత్మకంగా ఉండేందుకు ఏదైనా మంచి, సంతృప్తి కరమైన పని చేసేందుకు ఉపక్రమించాలి.ఇలాంటివి చిన్న చిన్న వాటితో మొదలు పెడితే...
చినుకు చినుకు సింధువైనట్టు.. మన మంచిపనుల జాబితా పెరుగుతుంది.
అవి అప్పుడప్పుడు తలచుకున్నా,చూసుకున్నా అనిర్వచనీయమైన ఆనందం మన సొంతం అవుతుంది.
నియమ బద్ధమైన జీవనం నిత్యానందానికి చిరునామా అవుతుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి