జ్ఞాపకాల చెలమి;- సుమ కైకాల

 బోల్డంత సంతోషం...
కాస్తంత విషాదం...
చాలా గతం...
కించిత్ వర్తమానం...
గుండెలో చెమ్మ ఉన్న ఎవరైనా
ఏదో ఓ సమయంలో ఏదో రూపంలో
ఈ అనుభూతికి లోను కావాల్సిందే!
జ్ఞాపకాలు లేని బతుకులు
రాళ్ళు రప్పలే...ముళ్ళపొదలే!
గతంలోని అనుబంధాలు
వర్తమానంలోని ఒంటరితనాన్ని ఓడగొడతాయి
నిన్నటి తీపి జ్ఞాపకాలు
నేటి చేదు అనుభవాల్ని మరిపిస్తాయి
ఫలితంగా ఆత్మన్యూయతలు...
ప్రేమరాహిత్యాలు పటాపంచలవుతాయి!
సమస్యలను సవాళ్ళను ఎదుర్కునే
కొత్త సత్తువ సొంతమవుతుంది
జ్ఞాపకాలు చెలమి లాంటివి
ఊరుతూనే ఉంటాయి...
ఊరిస్తూనే ఉంటాయి...
ఆ మూలలతో అనుబంధాలు పునరుద్ధరింపబడతాయి!!
కామెంట్‌లు