నా ఆంధ్ర బాష;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
 దేశబాషలయందు ముచ్చటగా మూడో స్థానాన నిలిచిన భాష నాది...
అత్యధికులు మాట్లాడే ద్రవిడ భాష నాది...
శతాబ్దాల చరిత్ర కలిగిన త్రిలింగ తెలుగు భాష నాది...
ఆద్యాత్మిక అనవాళ్ళతో అవిర్భ వించిన భాష నాది...
ముక్కొటి ఆంధ్రులు ముచ్చటగా మాట్లాడే ఆంధ్ర భాష నాది...
మాతృత్వం మూర్తీభవించిన భాష నాది...
అదికవి నన్నయ్య అనువదించిన భాష నాది...
శ్రీ కృష్ణదేవరాయలు తెగ మెచ్చిన భాష  నాది...
శాస్త్రీయమైన భౌతిక స్థితితో ఏర్పడ్డ ఏకైక భాష నాది...
అధిక అక్షరామాలతో అలరారుతున్న భాష నాది...
అమ్మ నేర్పిన భాష నాది...
అందరూ మెచ్చిన భాష నాది...
ప్రాకృతంతో త్రినగ- త్రి లింగమును ఏకం చేస్తూ 56 ఓనమాలతో ఒదిగిన భాష నాది...
అలాంటి నా ఆంధ్ర భాష ఇంకా ఎక్కడైన బ్రతికి వుంది అంటే...అది...
పిల్లలు పదివరకు చదివే పాఠ్య పుస్తకాలలో బ్రతికుంది...
తేనెలాంటి మాధుర్యాన్ని  కలిగిన అమ్మ పిలుపులలో బ్రతికుంది...
పరదేశాన స్థిరపడిన మన తెలుగువారి తలపులలో బ్రతికుంది...
ఆప్యాయంగా పలకరించే పచ్చని పల్లెలలో బ్రతికుంది...
మాతృభాషను అమితంగా ప్రేమించే మనసున్న వారి పెదవులు పలికే పదాలలో బ్రతికుంది...
అరుదైన అభిరుచిని కలిగిన అందమైన ఇలాంటి కవుల జల్లులలో
బ్రతికుంది
చివరగా పెద్దలకు నా మనవి...
అర్ధంకాని ఇతర భాషల్లో చదువులను ప్రోత్సహించి, సంతానాన్ని విదేశాలకు పంపించి, 
వారు అందిస్తున్న ఆదాయంతో స్వదేశంలో ఆస్తులు, ఐశ్వర్యాలు పేర్చి, 
కేవలం డాలర్లు సంపాదించే యంత్రాల జాబితాలో వారిని చేర్చి, ఆప్యాయత అనుబంధాల, 
విలువలను మరిపించి, కసాయిలుగా వారిని మార్చకండి...
మన మాతృభాషపై మమకారాన్ని చిన్నతనం నుండే పెంచి, 
వారిని మనసున్న మనుషులుగా మార్చే భాద్యత 
మీ మీదే ఉందన్న విషయాన్ని మరువకండి...


కామెంట్‌లు