గమ్మతీ.. గమ్మతీ ;-: గంగదేవు యాదయ్య.

 గమ్మతీ.. గమ్మతీ
చెట్టు చూస్తె గమ్మతీ
పుట్ట చూస్తె గమ్మతీ
గమ్మతీ.. గమ్మతీ
చుక్క చూస్తె గమ్మతీ
మొక్క చూస్తె గమ్మతీ
గమ్మతీ.. గమ్మతీ
మొగులు చూస్తె గమ్మతీ
బుగులు చూస్తె గమ్మతీ
గమ్మతీ.. గమ్మతీ
అరక చూస్తె గమ్మత
పొరక చూస్తె గమ్మతీ
గమ్మతీ.. గమ్మతీ
పువ్వు చూస్తె గమ్మతీ
నవ్వు  చూస్తె గమ్మతీ..
గమ్మతీ.. గమ్మతీ
తలుపు చూస్తె గమ్మతీ
తెలుపు చూస్తె గమ్మతీ
గమ్మతీ.. గమ్మతీ
నీరు చూస్తె గమ్మతీ
నిప్పు చూస్తె గమ్మతీ
గమ్మతీ.. గమ్మతీ
బస్సు చూస్తె గమ్మతీ 
బుస్సు చూస్తె గమ్మతీ 
గమ్మతీ.. గమ్మతీ
మబ్బు చూస్తె గమ్మతీ
సబ్బు చూస్తె గమ్మతీ
గమ్మతీ.. గమ్మతీ
ఆమ్మ చూస్తె గమ్మతీ
అయ్య చూస్తె గమ్మతీ..
పొద్దు పొడుపు గమ్మతీ
పొద్దంతా సమ్మతీ
రాత్రి వస్తె బుగులూ
రాత్రంతా దిగులు..
కుర్రో- కుర్రు.
=============
( రచయిత: ఉయ్యాల -జంపాల: బుజ్జి పాటలు)
కామెంట్‌లు