న్యస్తాక్షరి.;-టి. వి. యెల్. గాయత్రి.పూణే.మహారాష్ట్ర
 బా,ల,స్వా,మి.
-------------------
తేటగీతి /
(బా)ల భానుని ఫలమని పట్ట బోయి 
గగనసీమ(ల) పరువెత్తె గాలి చూలి 
(స్వా)మి కార్యము సల్పిన సాహసికుడు 
 పుడ(మి)యందున చిరకీర్తి పొందె హనుమ.
న్యస్తాక్షరి /
శ్రీ, శై, ల, ము.
--------------
ధ్రువ కోకిల.
కరుణ చూపుమ !(శ్రీ)కరా!హర!కాంచుమా!విజయంకరా!
సిరుల నిచ్చెడి దేవరా!శివ!సిద్ధ (శై)లసుతావరా!
పరమపావన కా(ల) భైరవ!
పాహి పాహి!శుభంకరా!
పురహరా!నను కన్న దేవర!
(ము)క్తి నీయుమ! వేగమే!


కామెంట్‌లు