వాయువునై వస్తున్న నీకోసం ప్రతీక్షణం...!
ఆయువునై ఉంటున్న నీలో క్షణక్షణం...!
లేదంటే నీ ఊపిరాగిపోతుందని...!
నాకు తెలుసు
నాపై నీకు జాలి లేదని...ఐనా “నా ప్రతి క్షణం నీ కోసమే”...!
అగ్నినై ఉదయిస్తున్న నీకోసం అనుదినం...!
వెలుగురేఖలు పంచుతున్న దినదినం...!
లేదంటే కారుచీకటి నిన్ను కమ్మేస్తుందని...!
నాకు తెలుసు
నాపై నీకు కరుణ లేదని...ఐనా “నా ప్రతి క్షణం నీ కోసమే”...!
నీటినై ప్రవహిస్తున్న నీ చుట్టూ అను క్షణం...!
ప్రాణాధారమైన నీకు ప్రతిక్షణం...!
లేదంటే నువ్వు దాహంతో కాటికెెళ్తావని...!
నాకు తెలుసు
నాపై నీకు కనికరం లేదని...ఐనా “నా ప్రతి క్షణం నీ కోసమే”...!
పుడమినై భరిస్తున్న నిన్ను ప్రతీక్షణం...!
భారమైనా మోస్తున్న నిన్ను అను క్షణం...!
లేదంటే నీడ నిలకడ నీకు ఉండదని...!
నాకు తెలుసు
నాపై నీకు బాధ్యత లేదని...ఐనా “నా ప్రతి క్షణం నీ కోసమే”...!
నింగినై పైనున్న నీకోసం ప్రతిక్షణం...!
మేఘ, గాలి,వెలుగుకు దారినౌతున్న అనుక్షణం...!
లేదంటే నీ మనుగడకు మార్గమే లేదని...!
నాకు తెలుసు
నాపై నీకు ప్రేమ లేదని...ఐనా “నా ప్రతి క్షణం నీ కోసమే”...!
పంచ భూతాలే కవితాక్షరమాలతో మనిషిని అర్జించిన వేళ...ఈ “నా ప్రతి క్షణం నీ కోసమే” - 1.
(సశేషం...).

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి