రచయిత్రి; - సుమ
 " ఇదివరకు ఆదివారం వచ్చిందంటే సాయంత్రం బయటకు వెళ్దాం అని గొడవ చేసేదానివి. ఇప్పుడు ఏమైంది నీకు? నన్ను పిల్లలను పంపించి నువ్వు మాత్రం ఇంట్లో ఉoటున్నావు? " అనుమానంగా అడిగాడు అవతారం.
" అదేం లేదు లెండి కథలు రాయడం నేర్చుకుందాం అని ప్రయత్నిస్తున్నాను. పక్కింటి కామాక్షి  కథలు రాయడం ఎలా అనే గ్రూప్ లో చేరిందట. నన్ను కూడా చేర్చమన్నాను. అదేంటో వాళ్ళు చకా చక రాసేస్తున్నారు. నాకు చదవడమే రావడం లేదు" తల పట్టుకొని అంది ఆoడాలు.
' హమ్మయ్యా!  షాపింగ్ గొడవ వదిలింది ' మనసులో అనుకుంటూ " బాగా ప్రయత్నించు ఆoడాలు! ఏదో ఒక రోజు  వాల్మీకి రామాయణం రాసినట్లు నువ్వు కూడా ఏదో ఒక గ్రంథం రాస్తావు "... అన్నాడు అవతారం.
"అంతే అంటారా ? నేను కూడా రచయిత్రిని అవుతానా!..." ఫోన్ పట్టుకొని కలల ప్రపంచం లోకి వెళ్ళిపోయింది ఆండాలు.

కామెంట్‌లు