జాబిలి ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 కోకిలమ్మ కూత పెట్టె
పాలపిట్ట పారి పోయె
కోడిపుంజు కొండ ఎక్కె
గువ్వ చూడు గూడు చేరె
చిలుకమ్మ కులుకుతు ఉండె
పావురాయి పడుకొని ఉండె
గోరువంక గునగున నడిచె
అన్నీ చూసిన నెమలమ్మ
ఆనందంగా నాట్యము చేసె !!

కామెంట్‌లు