నా ..ఉత్ప్రేరకాలు ..!!-----డా.కె.ఎల్.వి.ప్రసాద్-- హన్మకొండ.
 మనవరాలి పుట్టుక 
మానసికంగా 
నాలో ఉత్తేజం 
కలిగించింది ...!
ఆమె ప్రతి....
కదలికను ,
ఒక కవితగా 
మలిచేలాచేసింది !
ఆమె పేరుతో (ఆన్షిలు)
ఒక శతకమే ---
మొదలుపెట్టించింది ,
మూఁడు పుస్తకాలకు 
'ఆన్షీ' ప్రేరణ అయింది !
ఇప్పుడు మనవడి 
ఆగమనం ...
మరింత ఉత్సాహానికి 
తెరలేపింది !
మనవడు 'నివిన్ అయాన్ష్'
'నల్లి' వారి వంశోద్దారకుడు
నాతోఏమేమిచేయిస్తాడో
ఎదురుచూడాలిసిందే !!
                ***

కామెంట్‌లు
Shyam Kumar C చెప్పారు…
బావుంది..ఇంకొక పుస్తకం అచ్చు వేస్తారు అని అనుకుంటున్నా sir