రెక్కలు ;-ఎం. వి. ఉమాదేవి
1)
మొక్కలన్నీ 
పెంచాక 
ఫలాలతో 
ఉపయోగం 

రైతే మేలు 
తల్లిదండ్రుల కంటే !!
2)
వరకట్నం 
తప్పించుకునే 
ఉపాయం 
చదువు,ఉద్యోగం 

అమ్మాయికృషి 
ఫలించింది !!
3)

పవిత్ర 
గోదావరి 
అంటూనే 
వ్యాపారవ్యవస్థ

పడవమునక
"పాపి "కొండలు !
4)

గోదార్లో కొత్తనీరు 
వలేస్తే పడే 
పులసచేపలు 
తులలేనివిలువ 

గొప్పఆదాయo 
శ్రమజీవులకి !

5)
పనెక్కువ 
అయిందని 
బెదిరిపోదు 
ఆమె 

పనివిభజనతో 
విశ్రాంతిగానే 
6)
గ్రంథసమీక్షలో 
పేరులేదని 
గొడవచేస్తే 
ఎలా? 

ఉన్నపేరు
కూడాపోతుంది !


కామెంట్‌లు