ఔరంగాబాద్ గుహలు .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 ఔరంగాబాద్ గుహలు మహరాష్ట్ర బీబీ కా మక్ బారా కు సమీపంలో కలవు. ఇవి చాలా ప్రాచీనమైనవి.
బౌధ్ధమతానికి చెందిన గుహలు. మొత్తం ఏడు గుహలు కలవు ఈ గుహలను రెండు గా ప్రదేశాలు గా విభజించారు. వీటిలో మూడవ గుహ ఏడవ గుహ ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. 
గుహ1.
7వ శతాబ్దంలో నిర్మించారు.దీనికి 76 అడుగుల వరండా,8 మూలస్తంభాలు ఉన్నాయి .ఈ స్తంభాలకు చతురస్రపునాది ,బ్రాకెట్ కెపిటల్స్ స్త్రీలతో అలంకరించబడి ఉన్నాయి .ఈ గుహలోని చాలా శిల్పాలు అజంతాలో ఒకటో గుహలోని శిల్పాలు శైలితో పోలి ఉంటాయి. పశ్చిమంగా బుద్ధుడు ఒక తామర పువ్వు మీద ఉన్నట్టు ఓ శిల చెక్కబడింది.
గుహ2.
ఇది చాలా వరకూ పూర్తయిన కట్టడం .ఈ గుహ చైత్యాలు అయినా బ్రాహ్మణ దేవాలయ లక్షణాలు కలిగి ఉంటుంది.ఎంతో ఎత్తులో కూర్చున్న ఈ గుహ బుద్ధుడు ఎత్తైన విగ్రహం కలదు.
గుహ3.
దీని వరండా అద్భుతంగా చెక్కబడిన 12 కాలమ్స్ తో పెద్దహాలు కూడా ఉంది .దీని శైలి అజంతాలోని 1,26 వ గుహల పోలి ఉంటాయి. ఈ గుహలో బుద్ధప్రతిమ,హరం ఉన్న స్త్రీల బొమ్మలు ఉన్నాయి. ఈ గుహ మొత్తంలోతు 82 అడుగులు. వెడల్పు 63 అడుగులు.ఇది భారతదేశంలో పూర్తిగా అభివృద్ధి చెందిన నవీన బుద్ధగుహాలు.
గుహ4.
ఈ గుహలు మిగతా వాటికంటే పురాతనమైనవి. హీనాయానానికి చెందిన చైత్యహాలు ఇది.
గుహ5.
ఈ గుహలో అంతగా ఆసక్తి ఉన్న సమాచారం ఉండదు .ఇది మైలు దూరం తూర్పుదిశగా అదే పర్వతశ్రేణిలో రెండో తవ్వకాల సమూహంలోనిది. ఇక్కడకు ఒక అస్తవ్యస్తమైన దారిగుండా చేరుకోవచ్చు.
గుహ6.
ఈ గుహలు చైత్యహాలు, విహారలక్షణాలను కలిగిఉంటాయి. దీనికి 3 వైపులా గదులు ఉన్నాయి. ఈ పుణ్యస్థలంలో బుద్ధుని పెద్ద విగ్రహం అనుచరులతో ఉంది. 3 గదుల్లోనూ ఒక దానిలో రాతి మంచం ఉన్నాయి.
గుహ7.
ఈ గుహలో ధ్యానమందిరాలు గుహ, వెనుక చెక్కబడిన బొమ్మలు ఉన్నాయి.ఇక్కడ ఉన్న 6 గదులు బుద్ధ సన్యాసులకు గృహాలుగా ఉపయోగపడ్డాయి.ఈ శిల్పాలు మహాయాన మైథాలజీని కలిగి ఉన్నాయి.వరండా వెనుక గోడ మీద, తలుపు ఎడమవైపు పద్యపాణి అనే భోదిసత్వుని బ్రహాండమైన బొమ్మలు ఉన్నాయి.ఇతను తరచుగా బుద్ధుడితో ఉన్నట్లు ఉంటుంది.
గుహలను చూడలి అంటే రుసుము చెల్లించాల్సి ఉంటుంది భారతీయులకు రూ.10 విదేశీయులకు రూ.100 గాను కలదు. ఈ గుహలను ఉదయం 9 గం. ల నుండి సా.5 గం.ల వరకు చూడవచ్చ.


కామెంట్‌లు