చెమక్కులు..సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ

 ప్రఖ్యాత రచయిత జూల్ వెర్న్ ఒక మిత్రుని కలవాలి అని వెళ్లాడు. అతను లేడు.కానీ ఓనూతన వ్యక్తి అక్కడ పరిచయం ఐనాడు.ఆవ్యక్తి మహాసంబరపడ్తూ"వావ్!నాదేనండీ అదృష్టం అంటే!ఈరోజు నేను నక్కని తొక్కివచ్చాను కాబోలు! ఇంత గొప్ప రచయిత ను కల్సుకునే అదృష్టం కలిగింది. ఎన్ని సాహసయాత్రలు చేస్తున్నారో!!? అసలు అన్నిరకాల ప్ర యాణాలు  అంతంత దూరాలు ఎలాతిరుగుతున్నారు సార్!? పైగా అక్షరాలు గా అద్భుతమైన కథలుగా మలుపులతో తిప్పి ఉత్కంఠ కలిగిస్తున్నారు!?"అని తెగ తన భావాల్ని నాన్ స్టాప్ గా వెల్లడించాడు.జూల్ వెర్న్ అంతా వింటూ "థాంక్స్ మీఅభిమానానికి!"అన్నాడు. నిజానికి జూల్ వెర్న్ తనగదిలో ఎంచక్కా తలుపులు బిడాయించుకు కూచుని కల్పనాలోకంలో విహరిస్తూ కాగితం పై కలంపెట్టి గబగబా రాసేశాడు. తమాషా ఏమంటే  అందులో కొన్ని పరిశోధనలతో సాకారం చేశారు శాస్త్రవేత్తలు!"ఎరౌండ్ ది వరల్డ్  ఇన్ ఎయ్ టీ డేస్" ప్రసిద్ధ రచన!మరి విమానం లో  అంతరిక్షంలో మనిషి షికార్లు కొడుతున్నాడు కదా!?
అలెగ్జాండర్ డ్యుమాస్ ని  ఒకసారి ఎవరో విందుకి ఆహ్వానించారు. ఆయన మెట్లు ఎక్కుతూ కాలుజారి కింద పడబోయేంతలో ఎవరో చేతుల్తో పట్టుకుని ఆపారు.విక్టర్ హ్యూగో వెంటనే వ్యంగ్యంగా అన్నాడు "డ్యుమాస్!పాపం నడవలేకపోతున్నావా? నాభుజంపై చెయ్యివేయి.నిన్ను పట్టుకుని నడిపిస్తాను." డ్యుమాస్ ఠపీమని అన్నాడు " థాంక్స్! నేను కింద పడినా వెంటనే లేచి నడిచే సత్తా ఉంది. నేను నీహీరో బర్ గ్రేవ్స్ ని కాదులే!" ఇందులో అరకాసు అంత తిరకాసు ఉంది. హ్యూగో రచనలన్నీ సూపర్ డూపర్ హిట్! కానీ బర్ గ్రేవ్స్ అనే నాటకం ఎవర్నీ ఆకర్షించలేక ఫట్ మని బాల్చీ తన్నేసింది. దాన్ని దృష్టి లో పెట్టుకుని తన అక్కసు వెళ్లగక్కాడు.ఆరోజుల్లో ఇలా రచయితల మధ్య అసూయ కుళ్ళు చెలరేగి మాటలతో  తమ నోటి దురద తీర్చుకునే వారు. అలాంటి వారికి తగిన మందు"నీచిత్తం వచ్చినట్టు వ్రాసుకో!వాగివాగి స్పందన లేక  చతికిల పడతావు"అని  గమ్మున ఊరుకోడం ఉత్తమం!కానీ నేటి మీడియా వల్ల గోరంత కాస్త కొండంత కావటం తెగ పబ్లిసిటీ తో రెచ్చిపోటం జరుగుతూ ఉంది.
కామెంట్‌లు