పరీక్ష!అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజు ద్వారకలో నిద్రపోతున్న కృష్ణ భగవానుడు  రాధపేరును కలవరించటంచూసి రుక్మిణి హడావిడిగా లేపింది"ఏంటి స్వామీ!నామందిరంలో నిద్రపోతూ ఆపల్లెభామ రాధపేరు కలవరిస్తున్నారు?"
కాస్త కినుక కోపం ఉక్రోషం తో అడిగింది.ఆయన తాపీగా చెప్పాడు"ఆమె కి పరీక్ష పెడతాను .చూద్దువుగానీ పద!"ఇద్దరు యమునాతటంని చేరారు.కృష్ణుడు తీగవంతెన సృష్టించాడు యమునా నదిపై.ఇద్దరినీ నీరు నింపిన కుండ లేని నెత్తిన పెట్టుకొని ఇక్కడి నుంచి తీగపై  నడుచుకుంటూ యమునా నది ఆవలి ఒడ్డుకు నడవమన్నాడు.కృష్ణనామంజపిస్తూ రుక్మిణి తీగపై నడుస్తూంటే కుండ మధ్యలోనే ఢామ్మని నీటిలో పడింది.ఆమె ఆవలి ఒడ్డుకు చేరింది.రాధ మాత్రం చకచకా కుండ కింద పడకుండా నీరు చిందకుండా ఆవలి ఒడ్డుకు చేరింది."నీవు ఎలా నడిచాను?"రుక్మిణి ఆశ్చర్యంగా అడిగింది."నేను అసలు నడవలేదు. ఆకుండనే నన్ను సురక్షితంగా చేర్చింది"రాధ మాటలతో రుక్మిణి కి ఆమె గొప్ప తనం తెలిసివచ్చింది🌹
కామెంట్‌లు