సుప్రభాత కవిత ; -బృంద
గగనపు దారిలో
మేఘాల పల్లకిలో
కనకవీణపై
ప్రత్యూష రాగాలు పలికిస్తూ

సుమబాలల నవ్వులకు
మెరుపులు అద్దుతూ..

పచ్చని పైర్లకు
వెచ్చగ పదును పెడుతూ

పుత్తడి రంగులు
మొత్తం నింపుతూ

జగతికి జీవం నింపుతూ

గగన కాసారంలో
ఠీవిగ సాగే రాయంచలా

తన గమనం తో
మన పయనం నడిపే

ప్రభాకరుడికి  వందనాలతో

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు