ప్రపంచంలో ఏ జీవి జీవితం కూడా సక్రమంగా జరగదు అనేక అడ్డంకులు వస్తూనే ఉంటాయి. వాటిని ఎదుర్కొని ముందుకు నడిస్తే ఆ జీవులు ప్రశాంతంగా ఉండగలుగుతారు లేకపోతే కష్టాలలో పడిపోతారు. కుటుంబము అంటే తల్లి తండ్రి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు అంతా కలిసి ఉమ్మడిగా ఉండడం. ఒకరికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మిగిలినవారు ఆదుకుంటూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. బంధు వర్గంలో ఉన్న వారు కూడా వచ్చి ఓదారుస్తూ ఉంటారు. తాను పరిష్కరించుకోలేని ఆపద వచ్చినప్పుడు బంధుమిత్రులను తనకు కావలసిన వారు ఎవరో తన బాగు కోరేవారు ఎవరో తెలుస్తుంది. ఏ కొంచెం మోతుబరి రైతు అయినా పాలేరును పెట్టుకొని పని చేయించుకుంటూ ఉంటాడు. తనకు ఏదైనా జరిగినప్పుడు ఆ బంటు కాపాడుతూ ఉంటాడు కూడా. నిజానికి ప్రాణానికి ప్రాణం ఇచ్చే వాడే బంటు అతని తత్వాన్ని తెలుసుకోవాలంటే యజమానికి ఏదైనా కష్టం రావాలి. ఆ సమయంలో అతను చేసే పనిని బట్టి అతని తత్త్వం బయటపడుతుంది. వివాహం చేసుకున్న వాడు తన భార్యతో హాయిగా కాపురం చేస్తూ ఉండటం కాలం కలిసి రాక దురదృష్టవశాత్తు చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయినప్పుడు ఆ భార్య తత్వం తెలుస్తోంది. చేతినిండా డబ్బు ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించింది లేనప్పుడు ఎలా సహకరిస్తుంది అనేది తెలుస్తుంది.
ఆపదలందు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి