ఆనందం వెదుకుతూ.....అనుభూతులు పంచుతూ.....అనుభవాలు మోస్తూ...అభిమానంగా పలకరిస్తూఅనుబంధాలు పెంచుకుంటూ..ఆప్యాయతలు పంచుకుంటూ...అడ్డంకులు దాటుకుంటూ.....ఉనికిని చాటుకుంటూ...జలజలమని జారుతూగలగలమని పాఱుతూసరసరమని పాకుతూ..బిరబిరా కదలుతూ....ఎన్ని తనలో కరిగినా....ఏవి తనతో కలిసినా...కొన్ని మధ్యలో మరలినాఎన్నో చివరకు మిగిలినాదేన్నీ సొంతమనుకోకవేటినీ ఆశ్రయించకఎక్కడా విశ్రమించకఎపుడూ ధ్యేయం మరువకసాగే నదీ గమనంఅచ్చు మన జీవితగమనంలా!!అందరితో ఉంటూఅందరిలో ఉంటూఎవరికీ అందక.....ఎక్కడా ఆగకసాగే మన జీవిత చక్రంలోమరో అందమైన అరుణోదయానికి💐💐 సుప్రభాతం 💐💐
సుప్రభాత కవిత ; బృంద
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి