రుబాయీలు -డా.అడిగొప్పుల సదయ్య
1.
కడలిలోని కష్టాలను తేల్చుతుంది నీదు కవిత
గడచిచనిన గాథలన్ని తవ్వుతుంది నీదు కవిత
పడచుదనపు ఛాయలింక పోలేదేం నీకు మహతి!
నడచుచున్న కాలగతిని ఆపుతుంది నీదు కవిత

2.
మబ్బులోని కన్నీళ్ళను రాల్చుతుంది నీదు కవిత
డబ్బులోని బంధాలను చీల్చుతుంది నీదు కవిత
జబ్బులేని సమాజమే రావాలని ఓ మహతీ!
నిబ్బ

రముగ మాట తూట పేల్చుతుంది నీదు కవిత


డాక్టర్ అడిగొప్పుల సదయ్య
వ్యవస్థాపక అధ్యక్షుడు 
మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం
9963991125 

కామెంట్‌లు