చాక్లెట్; డాక్టర్ . కందేపి రాణిప్రసాద్


 ఈ ముద్దుల పాప పేరు చాక్లెట్.అసలు పేరు వేరే ఉంది లెండి."అనన్య ' అసలు పేరు.ఇప్పుడు అందరికీ ముద్దు పేర్లు ఉంటున్నాయి కదా.అందుకే వాళ్ల మమ్మీ చాక్లెట్ అని ముద్దు పేరు పెట్టింది.ఇంతకీ ఈ పాపకు పేరుకు తగ్గట్టే చాక్లెట్లు అంటే చాలా ఇష్టం.ఏళ్ల వేళలా తింటూనే ఉంటుంది.క్యాండీ లు, డైరీ మిల్క్ లు, కూకీలు, డౌ నట్లు,తెగ తింటుంది. స్వీట్లు తిని తిని పళ్ళు పుచ్చిపోయాయి.పన్ను నొప్పి తో డాక్టర్ దగ్గరకు వెళ్ళారు. డాక్టర్ చూసి చాక్లెట తినడం మానక పోతే పన్ను పీకేస్తను అని బెదిరించారు. అప్పుడు పాప ఇంకెప్పుడూ తినను అని ఏడ్చింది.ok అన్నారు అందరూ. డాక్టర్ మందులు రాసి ఇచ్చారు.చాక్లెట్ తినగానే నోరు శుభ్రం చేసుకోవాలి అని అన్నారు.పాప సరే అని చెప్పనది.కామెంట్‌లు