*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0128)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*దక్షుడు 60 మంది కన్యలను వివాహమాడటం - వీరణిలో సంస్థ శివదేవి పుట్టడం - ఆమె చేష్టలతో తల్లిదండ్రులు ఆనందించడం*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
*దక్షుని ఇంట వీరిణి గర్భమున శివదేవి పుట్టినప్పుడు అన్ని దిక్కులలో శాంతి నిండింది. దేవతలు ఆకాశంలో నిలబడి మంగళ వాయిద్యాలు మ్రోగించారు. మేఘుడు చిరు జల్లులు చిలకరించాడు. పుష్ప వృష్టి చేసారు మునులు, రుషులు. ఇవి అన్నీ కూడా జరగబోయే శుభాలకు శుభ సూచికములుగా కనిపించాయి దక్షునికి.*
*భగవతి శివదేవి తన శక్తి తో మానవ రూపంలో వీరిణి పక్కలో శిశువుగా పడుకుని, పుట్టగానే పంచభూతాల స్పర్శ తగలి ఏడ్చే సాధారణ మానవ బిడ్డలాగా ఏడ్చింది, అంబ. ఆ పసిపాప ఏడుపు విన్న వీరిణి పరిచారికలు అందరూ సంతోషంగా ఆమె పాన్పు వద్దకు వచ్చి పాపను ఆడించసాగారు. అసిక్ని, కుమార్తె యొక్క అలౌకిక సౌందర్యాన్ని చూచి చాలా ముచ్చట పడింది. సాక్షాత్తు భగవతియే తన పుత్రికగా వచ్చింది అని తెలియదు కదా! వీరిణికి.*
*అంబ పుట్టుకను రాజ్యంలో మహా సంరంభంగా జరిపించాడు దక్షుడు. యజ్ఞాలు, యాగాలు తాను చేసి, తన పుర ప్రజలతో కూడా చేయించాడు. దాన ధర్మాలు చేసాడు. ప్రజలు అందరూ వారి ప్రభువైన దక్షునికి, కొత్తగా పుట్టిన బిడ్డకు మేలు కలగాలని జయజయ నాదాలు చేసారు. పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ, మంగళ వాయిద్యాలు వాయిస్తూ గొప్పగా ఉత్సవాలు జరుపుతున్నారు. దక్షుడు తన బిడ్డకు వేదంలో చెప్పబడిన వైదిక కర్మలు అన్నీ చేసి, పాపకు"ఉమ" అని పేరు పెట్టాడు. అన్ని శుభ లక్షణములతో వున్న "ఉమ" ను చూచిన ప్రజలు వేరు వేరు పేర్లతో పిలుస్తున్నారు. ఏ రూపమూ, పేరు లేని జగదంబ ఆద్యకు అన్ని పేర్లు, రూపాలు ఆమెవే కదా!.*
*బాలికగా దక్షుని ఇంట వెలసిన శివదేవి, తన స్నేహితులతో ఆట పాటలలో కూడా పరమేశ్వరుని రూపాన్ని చూస్తూ వుండేది. శుక్ల పక్షము లోని చంద్రుడు లాగా దిన దిన ప్రవర్ధమానం అవుతూ యుక్త వయస్కురాలు అయ్యింది, ఉమ. స్థాణుడు, నిర్గుణుడు, నిరాకారుడు, రుద్రుడు అంటూ అనుక్షణమూ పరమశివుని ధ్యానంలోనే గడుపుతోంది, ఉమ. ఎల్లప్పుడూ, శివధ్యానంలో వుంటూ, శివుని పాటలు పాడుకుంటూ అపర శివ భక్తురాలిగా వుంటోంది, ఉమ.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు