*చంపకమాల:*
*హలకులి శాంకుధ్వజ శ | రాసన శంఖరధాంగ కల్పకో*
*జ్జ్వల జలజాత రేఖలను | సాంకములై కనుపట్టుచున్న మీ*
*కలిత పదాంబుజ ద్వయము | గౌతమపత్ని కొసంగినట్లు నా*
*తలపునఁ జేర్చి కావఁగదె | దాశరధీ కరుణాపయోనిధీ.*
*తా:*
సముద్రమంతటి దయకు రూపమైన వాడా! దశరథుని కుమారుడా! రామభద్రుడా! నాగలి, వజ్రాయుధము, రధానికి కట్టిన జెండా, విల్లు, శంఖము, రధభాగమైన చక్రం, కల్పవృక్షము, కామధేనువు అన్నిటి రేఖలను కలిగియుండి ప్రకాశిస్తున్న నీ పాదపద్మాలు గౌతమ ముని భార్య అహల్యకు శాపము తొలగించునట్లు, మా మనసులో కూడా నిండి వుండి మమ్మల్ని రక్షించు..... అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*కరుణా సముద్రా! నీ పాద మహిమ, నీ నామ మహిమ ఎంత పొగడిన కొంత మిగిలే వుంటుంది కదా! నీ ఆజానుబాహు రూపాన్ని సంపూర్ణంగా మా మనో ఫలకం పై నిలుపుకుని, నీ నామ మాధుర్యాన్ని తవితీరా త్రాగుతూ, ఆ మాధుర్యాన్ని అనుభవిస్తూ నిరంతరం నిన్ను నమ్ముకుని, నీవే అంతా అనుకుని జీవించే అవకాశం మనకు ఇమ్మని ఆ పుణ్యచరణుని పాదాలు పట్టి వేడుకుంటూ.....*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి