ఉత్పలమాల:*
*పెంపునఁదల్లివై కలుష | బృందసమాగమ మొందకుండ ర*
*క్షింపను దండ్రివై మెయివ | సించు దశేంద్రియ రోగముల్ నివా*
*రింపను వైజ్జువై కృపగు | రించి పరంబు దిరంబుగాఁగ స*
*త్సంపదలీయ నీవెగతి | దాశరధీ కరుణాపయోనిధీ.*
*తా:*
దయకు సముద్రము వంటివాడవైన రామభద్రా! నీ ప్రజలను పెంచి పోషించే తల్లిగా, వారు చెడ్డ వారి స్నేహంతో తప్పుదారిలో వెళ్ళకుండా చూసే తండ్రిగా, వారి శరీరంలో వచ్చే రోగాలను తగ్గించే వైద్యుడుగా, చివరికి, మోక్షమే గొప్పది అని కచ్చితంగా చూపించే సంపదలు ఇవ్వగల వాడివి నీవే కదా, కోదండ రామా ........ అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*"వైద్యో నారాయణో హరిః" ఇది శృతి / వేద వాక్యం. శాస్త్ర పరిజ్ఞానం ఎక్కువగా అనుసరిస్తున్న ఈ రోజుల్లో కూడా operation చేసే డాక్టర్, "నావంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ఈ రోగికి స్వస్థతను చేకూర్చు, స్వామీ" అని ప్రార్ధన చేసి, operation మొదలు పడుతున్నారు. ఇది మన సమాజానికి సనాతన ధర్మం మీద వున్న నమ్మకం. "మేము ఏమి చేస్తున్నా, చేయిస్తున్నది నీవే, పరంధామా!" ఇది మన జీవన గమనం. నేను చేస్తున్న ఈ పద్య సమర్పణ గానీ, మనం చేస్తున్న ఆలోచనలు కానీ, పనులు గానీ, చేయిస్తున్నది, నిర్గుణ, నిరాకార, నిర్వికార, నిరంజన రూపుడైన పరాత్పరుడే. పరమశివుడే. ఆది రూపుడైన ఆ మహాశక్తి యందు మనం మన మనసుని, ఆలోచనలను లగ్నం చేయగలిగే స్థితి మనకు కలిగించ మని ఆ సర్వేశ్వరుని వేడుకుందాము......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి