నిజమైన స్నేహితులు ;-బి. నేహా,-10వ తరగతి - 'బి' జెడ్పిహెచ్ఎస్ ఇందిరానగర్, సిద్దిపేట. సెల్ : 7036712986
 ఒక అడవిలో బన్నీ అనే ఒక అందమైన కుందేలు ఉండేది. అది అన్ని జంతువులతోనూ స్నేహంగా ఉండేది. తన స్నేహితులను చూసుకొని ఎంతో గర్వపడేది. ఒకరోజు బన్నీని కొన్ని వేట కుక్కలు తరుమసాగాయి. అది చాలా భయపడి ఎవరి సహాయమైనా పొందాలని చూసింది. వెంటనే తన  స్నేహితుడైన దుప్పి  దగ్గరికి పరిగెత్తింది. "మిత్రమా ! కొన్ని వేట కుక్కలు నన్ను తరుముతున్నాయి. వాటి చేత నాకు ప్రాణభయం ఉంది. ఇటువైపు వస్తున్నాయి. నన్ను కాపాడవా . నీ వాడి కొమ్ములతో వాటిని నా వెంట పడకుండా పొడువు అన్నది.
"నిజమే చేయగలను కానీ ఇప్పుడు నేను పనిలో ఉన్నాను ఎలుగుబంటిని అడుగు "
ఎలుగుబంటున్నడిగితే అది ఒక కారణం చెప్పి తప్పించుకుంది.
చివరకు గడ్డిమేస్తున్న ఆవును అడిగింది.
 ఎవరి కష్టం నుంచి వారే బయటపడాలి. ఎవరి ప్రాణాన్ని వారే కాపాడుకోవాలి. ఎవరికి ఎవరు సహాయం చేయరు. వెళ్ళు నీ ప్రాణం నువ్వే కాపాడుకో అని ఆవు అనగానే బన్నీ ప్రాణం పై ప్రీతితో పరిగెత్తింది. ప్రాణాన్ని కాపాడుకుంది.

కామెంట్‌లు